RRB NTPC Recruitment 2025 | దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న ఎన్‌టీపీసీ జాబ్స్, జేఈ, డీఎంఎస్, సీఎంఏ నోటిఫికేషన్లు. ఆ వివరాలు సంక్షిప్తంగా….
ఎన్‌టీపీసీ పోస్టులు( NON TECHNICAL POPULAR CATEGORIES )
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ( NON TECHNICAL POPULAR CATEGORIES
) పోస్టుల భర్తీకి ఆర్‌ఆర్‌బీ ప్రకటన విడుదలైంది.
) పోస్టుల భర్తీకి ఆర్‌ఆర్‌బీ ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 5810
పోస్టులు: చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్-161, స్టేషన్ మాస్టర్-615
గూడ్స్ ట్రెయిన్ మేనేజర్-3416
జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్-921,
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్-638, ట్రాఫిక్ అసిస్టెంట్-59
నోట్: సికింద్రాబాద్ ఆర్‌ఆర్‌బీ పరిధిలో 396 ఖాళీలు ఉన్నాయి.
ప్రారంభ వేతనం: చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్/స్టేషన్ మాస్టర్ పోస్టులకు రూ.35,400/-,
ట్రాఫిక్ అసిస్టెంట్‌కు రూ.25,500
ఇతర పోస్టులకు రూ. 29, 200
పోస్టుల వారీగా అర్హతలు
చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రెయిన్ మేనేజర్, ట్రాఫిక్ అసిస్టెంట్ – డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత
జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – డిగ్రీతోపాటు కంప్యూటర్‌పై ఇంగ్లిష్/హిందీ టైపింగ్ ప్రావీణ్యం ఉండాలి
వయస్సు: 2026, నవంబర్ 1 నాటికి 18- 33 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: సీబీటీ (టైర్-1, 2), టైపింగ్ స్కిల్/కంప్యూటర్
ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ద్వారా
సీబీటీ
టైర్-1లో- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ దీనిలో జనరల్ అవేర్‌నెస్-40, మ్యాథ్స్-30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్-30 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 100 మార్కులు, పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు.
టైర్-2లో- జనరల్ అవేర్‌నెస్-50, మ్యాథ్స్-35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్-35 ప్రశ్నల చొప్పున మొత్తం 120 ప్రశ్నలు ఇస్తారు.
పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు.
నోట్: పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు 1/3 మార్కులు కోత విధిస్తారు
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: నవంబర్ 20
వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in
