Site icon vidhaatha

TGPSC Group 1 | గ్రూప్-1 మెయిన్స్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు: అప్పీల్ కు వెళ్లాలని టీజీపీఎస్‌సీ నిర్ణయం

Telangana High Court

గ్రూప్-1 విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షా ఫలితాలు, జనరల్ ర్యాంకులను రద్దు చేస్తున్నట్టు తెలంగాణ హైకోర్టు మంగళవారంం నాడు కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం నాడు న్యాయ నిపుణులతో చర్చించింది. గ్రూప్-1 పై హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పు, దాని పర్యవసనాలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ బుర్రా వెంకటేశం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీనిపై ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే హైకోర్టులో తెలంగాణ పబ్లిక సర్వీస్ కమిషన్ రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది.

2024 అక్టోబర్ 21 నుంచి 27 మధ్య గ్రూప్-1 పరీక్షలు జరిగాయి. అయితే ఈ పరీక్షలకు సంబంధించి పేపర్ వాల్యూయేషన్ లో అవకతవకలు జరిగాయని కొందరు గ్రూప్ -1 అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు ఈ ఏడాది జూలైలో తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం నాడు తీర్పును వెల్లడివంచింది. 2022 లో గ్రూప్-1 లో నోటిఫికేషన్ లో 503 ఖాళీలున్నాయి. అయితే ఈ నోటిఫికేషన్ ను రద్దు చేసి 2024 తాజా నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే కొత్త నోటిఫికేషన్ లో 60 పోస్టులు అదనంగా చేర్చారు. దీంతో పోస్టులు 563కు చేరాయి. మెయిన్స్ పేపర్ల వాల్యూయేషన్ లో మోడరేషన్ పద్దతిని అనుసరించలేదని హైకోర్టు అభిప్రాయపడింది. పేపర్ వాల్యూయేషన్‌లో ప్రతి నిబంధనలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ తుంగలో తొక్కిందని హైకోర్టు ఆరోపించింది. ఈ పేపర్లను రీ వాల్యూయేషన్ చేయాలని ఆదేశించింది. దీని ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించింది. లేకపోతే మెయిన్స్ పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది.

Exit mobile version