Akhanda 2 | బిగ్ బ్రేకింగ్.. అఖండ 2 చిత్రం విడుద‌ల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే..!

Akhanda 2 | నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ-2 విడుదల వాయిదా పడింది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Akhanda 2 | నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ-2 విడుదల వాయిదా పడింది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ప్రీమియర్ షోలు రద్దు అయిన నేపథ్యంలో, ఇప్పుడు రిలీజ్ కూడా నిలిపివేయడంతో బాలయ్య అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఈ నిర్ణయంపై 14 రీల్స్ ప్లస్ ఎక్స్‌లో వెల్లడించిన ప్రకటనలో .. అనివార్య కారణాల వల్ల అఖండ 2 షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదు. అభిమానులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాం. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు మా టీమ్ నిరంతరం కృషి చేస్తోంది. మీ మద్దతు ఈ సమయంలో చాలా ముఖ్యం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం అని పేర్కొన్నారు.

ఇలా షాకిచ్చారేంటి..

ఇక ఈ పోస్ట్‌లో నిర్మాణ సంస్థ భావోద్వేగంగా స్పందించింది. అభిమానులకు కలిగే నిరాశ తమకూ తీరని బాధగా ఉన్నట్లు పేర్కొంది. సినిమా విడుదలకు ముందే ప్రీమియర్ షోలు అత్యంత ఆసక్తిని రేకెత్తించాయి. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ప్రీమియర్స్ రద్దు చేసినట్లు 14 రీల్స్ ప్లస్ ముందుగానే ప్రకటించింది. ప్రీమియర్ స్క్రీనింగ్ ద్వారా భారీ ఓపెనింగ్స్, పాజిటివ్ బజ్ సృష్టించాలని టీమ్ భావించగా, చివరి నిమిషంలో సమస్యలు తలెత్తడంతో ఆ ప్లాన్ పనిచేయలేదు.టెక్నికల్ ఇష్యూస్ కారణంగా షోలు రద్దయినట్లు మేకర్స్ విచారం వ్యక్తం చేశారు. “కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. మా వంతు ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది” అని వారు తెలిపారు.

ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంపునకు కూడా అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో, ప్రీమియర్ రద్దు, రిలీజ్ వాయిదా బాలయ్య అభిమానులను మరింత నిరాశకు గురి చేసింది. 2021లో విడుదలైన అఖండ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఈ సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. బోయపాటి–బాలయ్య కాంబినేషన్, యాక్షన్ శైలీ, రుద్రాక్ష శక్తి నేపథ్యంలో కథనం ఎలా ఉండబోతుందన్న ఆసక్తితో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే రిలీజ్ వాయిదా కారణంగా ఈ ఆసక్తి తాత్కాలికంగా నిలిచిపోయింది. మేకర్స్ ప్రస్తుతం సమస్యలను పరిష్కరించేందుకు పని చేస్తున్నారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నట్లు సమాచారం. అభిమానులు ఈ నిర్ణయాన్ని నిరాశతో స్వీకరించినా, మేకర్స్ ఇచ్చిన హామీతో పాజిటివ్ అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Latest News