HBD Rajinikanth | ఎంత ఎదిగిన ఒదిగి ఉండే స్టార్.. ఆయ‌న దారి ర‌హ‌దారి.. ర‌జ‌నీకి శుభాకాంక్ష‌ల వెల్లువ‌

HBD Rajinikanth | భారతీయ సినీ పరిశ్రమలో స్టైల్, స్వాగ్‌కు పర్యాయ పదంగా నిలిచిపోయిన సూపర్‌స్టార్ రజినీకాంత్ నేటితో 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ ప‌డిలోకి అడుగుపెట్టారు. హీరో అంటే తప్పనిసరిగా ఆరగడుగుల ఎత్తు, కండలు తిరిగిన శరీరం, మెరిసే రంగు ఉండాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా నిరూపించిన వ్యక్తి రజినీకాంత్. స్టైల్, స్వాగ్, అటిట్యూడ్, ప్రెజెన్స్‌తోనే వెండితెరపై ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తూ దశాబ్దాలుగా స్టార్‌డమ్ శిఖరాగ్రంలో వెలుగొందుతున్నారు.

HBD Rajinikanth | భారతీయ సినీ పరిశ్రమలో స్టైల్, స్వాగ్‌కు పర్యాయ పదంగా నిలిచిపోయిన సూపర్‌స్టార్ రజినీకాంత్ నేటితో 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ ప‌డిలోకి అడుగుపెట్టారు. హీరో అంటే తప్పనిసరిగా ఆరగడుగుల ఎత్తు, కండలు తిరిగిన శరీరం, మెరిసే రంగు ఉండాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా నిరూపించిన వ్యక్తి రజినీకాంత్. స్టైల్, స్వాగ్, అటిట్యూడ్, ప్రెజెన్స్‌తోనే వెండితెరపై ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తూ దశాబ్దాలుగా స్టార్‌డమ్ శిఖరాగ్రంలో వెలుగొందుతున్నారు. రజినీకాంత్ వెండితెరపై నడుచుకుంటూ వచ్చే ఆ వైబ్రేష‌న్ థియేటర్లను కుదిపేస్తుంది. డైలాగ్ చెప్పే తీరు, సిగరెట్ తిప్పే స్టైల్, పంచ్‌లలో చూపించే ఎనర్జీ ఇవన్నీ ఆయనకే ప్రత్యేకమైన స్టైల్‌. అందుకే ఆయనను కోట్లాది అభిమానులు కేవలం హీరోగా కాదు, ఆరాధ్యుడిగా భావిస్తారు. ఇండియా మొత్తం నుంచి జపాన్ వరకూ ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానులు వేల సంఖ్యలో చేరడం సాధారణమే.

1950 డిసెంబర్ 12న కర్ణాటకలోని మధ్య తరగతి మారాఠీ కుటుంబంలో శివాజీ రావు గైక్వాడ్‌గా జన్మించిన రజినీకాంత్ బాల్యం ఆర్థిక ఇబ్బందులతో నిండింది. స్కూల్ నాటకాలలో చిన్న పాత్రలతోనే ఆయన నటనీయ ప్రతిభ బయటపడింది. అనంతరం బెంగళూరు రవాణా విభాగంలో బస్ కండక్టర్‌గా పనిచేస్తూ టికెట్ ఇచ్చే తన ప్రత్యేక స్టైల్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించేవారు. నటుడిగా ఎదిగే పెద్ద కలతో చెన్నై చేరి ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన ఆయనలోని మెరుపును దర్శకధీరుడు కె. బాలచందర్ గుర్తించారు. “నువ్వు స్టారవుతావు” అని ఆశీర్వదించిన ఆయన మాట నిజమైంది. 1975లో ‘అపూర్వ రాగంగల్’తో ప్రారంభమైన రజనీ సినీ ప్రయాణం తరువాత ఎప్పుడూ వెనుదిరిగినట్టు లేదు. ప్రారంభంలో నెగటివ్ పాత్రలతో మెప్పించిన రజనీ 1978లో విడుదలైన ‘బైరవి’ ద్వారా హీరోగా పరిచయమై, అదే ఏడాది ‘సూపర్‌స్టార్’ బిరుదును సంపాదించుకున్నారు.

అనంతరం వచ్చిన ‘బాషా’ రజినీకాంత్‌ను శిఖరాగ్రంలో నిలబెట్టిన చిత్రం కాగా, ‘ముత్తు’, ‘నరసింహ’, ‘రోబో’ వంటి చిత్రాలు ఆయన క్రేజ్‌ను మరింత పెంచాయి. ముఖ్యంగా ‘ముత్తు’ జపాన్‌లో సంచలనం సృష్టించి రజినీకాంత్‌కు అక్కడ ప్రత్యేకమైన అభిమానగణాన్ని తెచ్చిపెట్ట‌డం మాములు విష‌యం కాదు. 70 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఎనర్జీ తగ్గలేదని ‘జైలర్’ చిత్రంతో మరోసారి నిరూపించారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 600 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసింది. ఈ ఏడాదితో సినీ ప‌రిశ్ర‌మలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయన, ‘కూలీ’ ద్వారా మరోసారి బాక్సాఫీస్‌ వద్ద తన మార్కెట్ ఏంటో చూపారు. మిశ్రమ అభిప్రాయాలు వచ్చినా 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం రజనీ మేనియాను ధృవీకరించింది.

సినిమా జీవితంలో పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ సహా అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలను అందుకున్న రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయిన ‘పడయప్ప’ చిత్రాన్ని నేడు రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో థియేటర్ల వద్ద రజనీ అభిమానులు పెద్ద ఎత్తున హంగామా సృష్టిస్తున్నారు. ఇంతటి ఆదరణను 50 ఏళ్ల పాటు నిలబెట్టుకున్న రజినీకాంత్‌కు సినీ ప్రపంచం తరఫున జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే తలైవా.

Latest News