Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అత్యంత గోప్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ నుంచి ఎలాంటి లీకులు బయటకు రాకుండా చిత్రబృందం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఈ మధ్యలోనే మహేశ్ బాబు తాజా లుక్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇప్పటివరకు రగ్డ్ గడ్డంతో మాస్ లుక్‌లో కనిపించిన మహేశ్, ఇప్పుడు సడెన్‌గా క్లీన్ షేవ్ చేసి వింటేజ్ స్టైల్‌లో దర్శనమిచ్చారు. ఈ కొత్త లుక్ చూసిన అభిమానులు ఆశ్చర్యానికి గురవుతుండగా, సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. “ఇది సినిమా కోసమేనా?” “జక్కన్న మరో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడా?” అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
సినిమా షూటింగ్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఫ్యామిలీకి సమయం కేటాయించడంలో మహేశ్ ఎప్పుడూ ముందుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలో మహేశ్ బాబు తన సతీమణి నమ్రత శిరోడ్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి నవ్వుతూ పోజిచ్చారు.
ఈ ఫోటోలో మహేశ్ బ్లూ కలర్ హుడీ, క్రీమ్ కలర్ ప్యాంట్ ధరించి కనిపించారు. తలకు నీలం రంగు క్యాప్ పెట్టుకుని క్లీన్ షేవ్ లుక్‌లో ఎంతో స్టైలిష్‌గా కనిపించడం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. మొన్నటి వరకూ గడ్డంతో రగ్డ్ లుక్‌లో కనిపించిన మహేశ్, ఒక్కసారిగా కొత్త లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి మరింత పెరిగింది.
అయితే ఈ కొత్త లుక్ ‘వారణాసి’ సినిమా కోసమేనా? లేక షూటింగ్‌కు కొద్దిరోజుల విరామం తీసుకుని రిలాక్స్ అవుతున్నారా? అనే విషయంపై స్పష్టత లేదు. కొందరు అభిమానులు మాత్రం వారణాసి సినిమాలోని రుద్ర పాత్రకు సంబంధించిన ఒక షెడ్యూల్ పూర్తయ్యిందని, అందుకే మహేశ్ క్లీన్ షేవ్ చేసుకున్నారని ఊహాగానాలు చేస్తున్నారు.
ఏది ఏమైనా, సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త లుక్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. జక్కన్న–మహేశ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఇలాంటి చిన్న అప్‌డేట్స్ ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్‌ను మరింత పెంచుతున్నాయి.
