Poonam Kaur | సోషల్ మీడియాలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే నటి పూనమ్ కౌర్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. గతంలోనూ పలు సందర్భాల్లో సినీ, రాజకీయ ప్రముఖులపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన ఆమె, ఈసారి నేరుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్స్ తీవ్ర చర్చకు దారితీశాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజినోవాతో కలిసి మహారాష్ట్రలోని నాందేడ్ గురుద్వారాను సందర్శించారు. అక్కడ నిర్వహించిన శ్రీ గురు తేగ్ బహదూర్ షాహిది సమాగమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సంప్రదాయ సిక్కు తలపాగా ధరించి కనిపించారు. ఈ ఫోటోలను జనసేన పార్టీతో పాటు జనసేన వీర మహిళా విభాగం తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్‌లో షేర్ చేశాయి.
ఈ ఫోటోలపై పూనమ్ కౌర్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ స్పందించారు. గురు తేగ్ బహదూర్ జీ త్యాగాన్ని ప్రస్తావిస్తూ, “వారసత్వాన్ని మార్చుకున్నవారు, లోపాలను వదిలించుకోని వారు గురువుల పట్ల నిజమైన గౌరవం చూపలేరు” అనే అర్థంలో ఆమె ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించినవేనని నెటిజన్లు భావించడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. అంతేకాదు, మరో నెటిజన్ పవన్ కళ్యాణ్ ఫోటోను షేర్ చేస్తూ ప్రాంతీయ విభేదాలపై కామెంట్ చేయగా, దానికీ పూనమ్ కౌర్ స్పందించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం, మతపరమైన అంశాలను ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. దీంతో కొందరు నెటిజన్లు పూనమ్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.
పూనమ్ ట్వీట్స్‌కు వ్యతిరేకంగా వచ్చిన కౌంటర్లకు కూడా ఆమె తిరిగి స్పందించడంతో సోషల్ మీడియాలో మాటల యుద్ధం మొదలైంది. వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ విషయాలను ఇలా బహిరంగ వేదికపై ప్రస్తావించడం సరైంది కాదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం పూనమ్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గురుద్వారా పర్యటన ఒకవైపు రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ప్రాధాన్యం సంతరించుకోగా… మరోవైపు పూనమ్ కౌర్ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వివాదంగా మారింది. ఈ ట్వీట్స్ ప్రస్తుతం నెట్టింట విస్తృతంగా వైరల్ అవుతూ, రాజకీయ–సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.
