Rakul Preet Singh | సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలకి విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ మధ్య హీరోయిన్ ఫోన్ నెంబర్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీంతో స్వయంగా వారు స్పందించాల్సిన పరిస్థితి వస్తుంది. రీసెంట్‌గా కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్ ఫోన్ నెంబర్ అంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఓ వ్యక్తి 9445893273 నంబర్ ద్వారా అచ్చం ఆమె లానే మాట్లాడుతుండటంతో అందరు అయోమయానికి గురయ్యారు. ఈ విషయంపై రుక్మిణి స్పందిస్తూ “ఈ నెంబర్ నాది కాదు. ఈ నెంబర్ నుంచి ఫోన్ లేదా మెసేజ్ వస్తే స్పందించవద్దు, ఇది సైబర్ నేరం. ఈ పని చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాను అని హెచ్చరించింది. రుక్మిణి చేసిన ఈ బహిరంగ హెచ్చరిక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
సోషల్ మీడియాలో సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నటీమణుల పేరుతో నకిలీ అకౌంట్లు సృష్టించడం, వాటి ద్వారా అభిమానులను మోసం చేయడం ఇప్పుడు సాధారణమైపోయింది.. తాజాగా ఈ వరుసలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా చేరింది. రకుల్ పేరుతో ఒకరు నకిలీ వాట్సాప్ అకౌంట్ సృష్టించి, ప్రజలకు మెసేజ్‌లు పంపుతున్నారని సమాచారం బయటకు వచ్చింది. దీనిపై స్పందించిన రకుల్, ఎక్స్ (ట్విట్టర్)లో ఒక పోస్ట్ పెట్టి అభిమానులను అప్రమత్తం చేసింది. “హాయ్ గైస్… ఎవరో నా పేరుతో వాట్సాప్‌లో వ్యక్తులతో చాట్ చేస్తున్నారని తెలిసింది. దయచేసి గమనించండి, అది నా నంబర్ కాదు. ఎవరూ ఆ నంబర్‌కి రిప్లై ఇవ్వొద్దు. వెంటనే బ్లాక్ చేయండి అని తెలియజేసింది.
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్‌లు పెరిగిపోవడంతో పలువురు నటీమణులు తమ అధికారిక ఖాతాలను ధృవీకరించుకోవాలని అభిమానులకు సూచిస్తున్నారు. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా కూడా ఇలాంటివి రోజు రోజుకి పెరుగుతూ పోతుండడంతో వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసులని కోరుతున్నారు అందాల ముద్దుగుమ్మలు.
