టీబీఆర్ సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నాగన్న, కె. లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కమర్తి నిర్మాతగా, ఎల్లప్ప కో-ప్రొడ్యూసర్‌గా, ఎంజీఆర్ రచన-దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘బ్లడ్ రోజస్’. ధర్మ కీర్తి రాజు, అప్సర రాణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? చూద్దాం…
కథ
హైదరాబాద్ నగర రాజకీయ నేపథ్యంతో కథ నడుస్తుంది. దేవిదాస్, బజరంగి దాస్ అనే ఇద్దరు ప్రభావవంతమైన నాయకులు తమ కుమారులను వచ్చే ఎన్నికల్లో నిలబెట్టేందుకు సిద్ధమవుతుంటారు. ఇదే సమయంలో నగరంలో వరుస హత్యలు సంచలనం సృష్టిస్తాయి.
ఈ హత్యలతో దేవిదాస్ కుమారుడు మదన్ పేరు బయటకు రావడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుంది. ఇది ప్రత్యర్థి బజరంగి దాస్ ప్లాన్ అని అనుమానాలు పెరుగుతాయి. కేసును విచారిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ అరుణ్ గోగోయ్ రాజకీయ ఒత్తిడుల కారణంగా సస్పెండ్ అవుతాడు. తర్వాత కేసు సీబీఐకి వెళ్తుంది. ఈ క్రమంలో అధిర అనే ఆఫీసర్ రంగంలోకి దిగుతుంది. అసలు హత్యల వెనుక ఉన్న నేరస్తుడు ఎవరు? అధిర ఎలా పట్టుకుంది? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ
‘బ్లడ్ రోజస్’ ఒక క్రైమ్-పాలిటికల్ థ్రిల్లర్‌గా సాగుతుంది. మహిళల శక్తి, సమానత్వం, ప్రేమలో నిజాయితీ వంటి అంశాలను కథలో మేళవించడం దర్శకుడి ప్రయత్నం. మహిళా పాత్రను బలంగా చూపించే విధానం సినిమా ప్రత్యేకతగా నిలుస్తుంది.
కథలో సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో పాటు సోషల్ మెసేజ్ ఇవ్వాలని చేసిన ప్రయత్నం కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ చేయగా, మరికొన్ని భాగాల్లో కమర్షియల్ టచ్ కనిపిస్తుంది.
నటీనటుల పనితీరు
-
అప్సర రాణి – అధిర పాత్రలో కొత్త లుక్‌తో ఆకట్టుకుంది. యాక్షన్, ఎమోషన్ సీన్స్‌లో మంచి నటన కనబరిచింది.
-
ధర్మ కీర్తి రాజు – అరుణ్ గోగోయ్ పాత్రలో తనదైన స్టైల్‌తో మెప్పించాడు.
-
శ్రీలు పృథ్విరాజ్ – జనని పాత్ర కథకు సహకరించేలా ఉంటుంది.
-
క్రాంతి కిల్లి – ఈసారి పాజిటివ్ షేడ్స్‌లో కనిపించి ప్రత్యేకంగా నిలిచాడు.
ఇక సుమన్, టార్జన్, ఘర్షణ శ్రీనివాస్, రాజేంద్ర, జూనియర్ రేలంగి, జగదేశ్వరి, మాణికుమార్ తదితరులు తమ పాత్రల మేరకు నటించి సినిమాకు బలం చేకూర్చారు.
టెక్నికల్ అంశాలు
దర్శకుడు ఎంజీఆర్ కథ, స్క్రీన్‌ప్లేలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించడానికి ప్రయత్నించారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సస్పెన్స్‌కు సపోర్ట్‌గా నిలిచాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
-
అప్సర రాణి పాత్ర & నటన
-
క్రైమ్-పాలిటికల్ నేపథ్యం
-
సస్పెన్స్ ఎలిమెంట్స్
మైనస్ పాయింట్స్
-
కొంతమంది పాత్రలు పూర్తిగా డెవలప్ కాలేదు
-
మధ్యలో స్లో నరేషన్ సన్నివేశాలు
