The RajaSaab Twitter Review | ప్రభాస్ ‘ది రాజాసాబ్’ టాక్ ఎలా ఉంది?

ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ ప్రీమియర్ షోలతో సోషల్ మీడియాలో సందడి మొదలైంది. మొదటి షో నుంచే ఫ్యాన్స్ హంగామా, కామెడీ, యాక్షన్, థమన్ మ్యూజిక్, ప్రీ-ఇంటర్వెల్ సీన్స్ వరకు అన్ని పాజిటివ్‌ కామెంట్లే వినబడుతున్నాయి. పూర్తి ట్విట్టర్ రివ్యూ మీకోసం.

Prabhas and Sanjay Dutt in an intense mystical fire background from The RajaSaab Twitter Review poster.

విధాత వినోదం డెస్క్​ | హైదరాబాద్​:

The RajaSaab Twitter Review | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వచ్చిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ ది రాజాసాబ్ జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఆంధ్రప్రదేశ్​ సహా పలు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ముందుగానే మొదలయ్యాయి. తెలంగాణలో ఇంకా షోలు పడలేదు. థియేటర్ల బయట ప్రభాస్ అభిమానుల హంగామా మామూలుగా లేదు. స్క్రీన్ మీద డార్లింగ్ కనిపించిన ప్రతి సారీ అభిమానుల్లో జోష్ పెరిగిపోయింది.

దాదాపు 15 ఏళ్ల తర్వాత ప్రభాస్ చేస్తున్న ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కల్కి తర్వాత వస్తున్న సినిమా కావడం కూడా ఆసక్తిని రెట్టింపు చేసింది. ఇప్పుడు ప్రీమియర్ షోస్ పూర్తయ్యాక ట్విట్టర్‌లో తొలి స్పందనలు బయటపడుతున్నాయి. మొత్తం మీద నెటిజన్లు పాజిటివ్ టాక్ ఇస్తున్నారు.

ఫస్ట్ షో టాక్వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్

ప్రీమియర్ షో చూసిన ఫ్యాన్స్ ట్విట్టర్‌లో వరుసగా రివ్యూలు ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీపై ఫ్యాన్స్ ఫుల్ వైబ్​లో ఉన్నారు.

డైరెక్టర్ మారుతి  ప్రభాస్​ కామెడీ టైమింగ్‌ను బాగా వాడుకున్నాడని అనేక మంది అంటున్నారు. ముఖ్యంగా దెయ్యానికి భయపడే ప్రభాస్ సన్నివేశాలు పగలబడి నవ్వించేలా ఉన్నాయి అని నెటిజన్లు చెబుతున్నారు.

హీరోయిన్లలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్—అందరూ అదిరిపోయారని పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి.
కొంతమంది నెటిజన్లు వింటేజ్ డార్లింగ్ తిరిగి వచ్చాడు అని ప్రత్యేకంగా హైలైట్ చేస్తున్నారు.

థమన్ మ్యూజిక్, క్లైమాక్స్, యాక్షన్టాక్ ఏంటంటే

బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే నెటిజన్ల వ్యాఖ్యలు ఒకేలా ఉన్నాయి:

యాక్షన్ ఎపిసోడ్స్, హాస్పిటల్ సీన్, క్లైమాక్స్ బ్లాక్‌బస్టర్ రేంజ్‌లో ఉన్నాయని ప్రీమియర్ షో చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.
చివరి 30 నిమిషాలు మూవీకి పెద్ద ప్లస్ అని వరుసగా ట్వీట్స్ వస్తున్నాయి.

ఫిల్మ్​ క్రిటిక్​ ఉమేర్ సంధూ ట్వీట్ మరింత హైప్ అందించాడు:

మొత్తం మీద ఫస్ట్ డే–ఫస్ట్ షో తర్వాత సోషల్ మీడియాలో వచ్చే భావన:
➡️ సినిమాకు పాజిటివ్ టాక్ స్ట్రాంగ్‌గా ఉంది.
➡️ ఫ్యాన్స్‌కు ఇది ఫుల్ మీల్స్‌.
➡️ సెకండ్ హాఫ్, క్లైమాక్స్ ప్రత్యేకంగా మెప్పిస్తున్నాయి.

ఇక కలెక్షన్లు ఎలా ఉంటాయి? భారీ బడ్జెట్ సినిమా కాబట్టి, అధికారిక నెంబర్లు వచ్చే వరకు కొంచెం వెయిట్ చేయాల్సిందే.

ఇక త్వరలో పూర్తి సమీక్ష మీ విధాత లో..

Latest News