విధాత : ఒకప్పటి టాప్ హీరోయిన్, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. నందమూరి కల్యాణ్‌రామ్ సినిమాలో ఆమె ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో నటించబోతున్నారని తెలుస్తుంది. విజయశాంతి 30 ఏళ్ల సినీ ప్రస్థానంలో వివిధ భాషాల్లో 180 సినిమాలు నటించారు. ఒసేయ్ రాములమ్మ, ప్రతిఘటన, కర్తవ్యం, వైజయంతి వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించిన విజయశాంతి హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. 1998 జనవరి 26న రాజకీయాల్లో అడుగుపెట్టిన విజయశాంతి బీజేపీలో చేరారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో బీజేపీ నుంచి తప్పుకుని 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నాలుగేళ్లకు తన పార్టీని టీఆర్ఎస్ లో కలిపేశారు. 2009 ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి ఎంపీ అయ్యారు. కొన్ని ప్రతికూల పరిణామాలతో ఆమె టీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యారు. 2014లో కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి అక్కడా ఇమడలేకపోయారు. 2020లో మళ్లీ బీజేపీ గూటికే చేరారు. మళ్లీ అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023లో తిరిగి కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. మధ్యలో సినిమాలు వదిలిన 13ఏళ్ల తర్వాతా 2019లో అనిల్ రావిడిపూడి దర్శకత్వంలోని మహేశ్‌బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా అనంతరం మళ్లీ బ్రేక్ తీసుకున్న విజయశాంతి తాజాగా మరో పవర్ ఫుల్ క్యారెక్టర్‌తో నందమూరి కల్యాణ్‌రామ్ సినిమాలో నటించేందుకు అంగీకరించినట్లుగా వార్తలు వెలువడటంతో ఆమె అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతుంది.
మళ్లీ సినిమాల్లోకి విజయశాంతి…కల్యాణ్ రామ్ సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్
కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. నందమూరి కల్యాణ్‌రామ్ సినిమాలో ఆమె ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో నటించబోతున్నారని తెలుస్తుంది.

Latest News
తక్కువ ధర, ప్రీమియం ఫీచర్లు : మోటరోలా ఎడ్జ్ 70 / 70 ప్రో వివరాలివిగో..!
దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్ : భారత్ భారీ విజయం — సిరీస్ కైవసం
అనన్య నాగళ్ల థండర్ థైస్ షో.. మామూలుగా లేదు భయ్యా!
చలికాలంలో ఇళ్లలో హీటర్స్ వాడటం ఎంత సేఫ్?
అమ్మ పాడే జోల పాటల్లో ఇంత గొప్పదనం ఉందా?
విమాన టికెట్ రేట్లపై సీలింగ్.. కేంద్ర విమానయాన శాఖ కీలక నిర్ణయం
ఐజేయూ నేతలను సత్కరించిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్
విశాఖ వన్డేలో డికాక్ సెంచరీ..భారత్ టార్గెట్ 271 పరుగులు
మోదీ–పుతిన్ భేటీలో అందరి దృష్టిని ఆకర్షించిన ఓ అందం
వాళ్లు వస్తే మంచి రోజులు కాదు..ముంచే రోజులొస్తాయి: సీఎం రేవంత్ రెడ్డి