Site icon vidhaatha

మామయ్య శుభాకాంక్షలు చంద్రబాబు, పవన్‌లకు… ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు విషెస్‌

విధాత : ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు హీరో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు ప్రియమైన చంద్రబాబు మామయ్యకి ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఎన్టీఆర్‌ తెలిపారు. మీ ఈ విజయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నానన్నారు. అద్భుతమైన మెజార్టీతో గెలిచిన నారా లోకేష్ కు, మూడోసారి ఘనవిజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచినా శ్రీ భరత్, పురంధరేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలని, అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు.

 

 

Exit mobile version