Site icon vidhaatha

మీ పిల్ల‌ల‌కు రెండేండ్లు నిండాయా? అయితే ఈ ఆహారం త‌ప్ప‌నిస‌రి..!

మీ పిల్ల‌ల‌కు రెండేండ్లు నిండాయా? రెండేండ్ల వ‌ర‌కు త‌ల్లి పాలతో పాటు ఉగ్గు లాంటి ఆహార ప‌దార్థాల‌ను అందించి ఉంటారు. కానీ రెండేండ్లు నిండిన త‌ర్వాత ఆ ఆహారం స‌రిపోదు. వారికి బ‌ల‌మైన పోష‌కాహారాన్ని అందించాలి. శారీరకంగా, మాన‌సికంగా అభివృద్ధి చెందాలి అంటే ఈ ఆహార ప‌దార్థాల‌ను మీ మెనులో క‌చ్చితంగా చేర్చాల్సిందే. స‌రైన ఆహారం ఇచ్చిన‌ప్పుడే వారిలో అభివృద్ధి జ‌రుగుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెంపొందించుకోవ‌చ్చు. వారికి మ‌నం పెట్టే ఆహారం న‌చ్చ‌క‌పోయిన‌ప్ప‌టికీ, తినిపించి, ఆరోగ్యంగా ఉండేలా చూడాల్సిన బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌పైనే ఉంది. మ‌రి ఆ ఫుడ్ వివ‌రాలు ఏంటో చూద్దామా..!

కోడిగుడ్లు

కోడి గుడ్ల‌లో ప్రోటీన్ పుష్క‌లంగా ల‌భిస్తుంది. ప్రోటీన్ అనేది పిల్ల‌ల పెరుగుదల‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. మీ పిల్ల‌ల‌ను శ‌క్తివంతంగా కూడా త‌యారు చేస్తోంది. కోడిగుడ్లు శ‌రీరంలో బ‌ల‌మైన రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొందిస్తాయి. ఇక అల‌స‌ట, ఎముక‌ల నొప్పి నుంచి కూడా ఉప‌శ‌మ‌నం పొందేలా చేస్తుంది.

పాలు

పాల‌ల్లో విట‌మిన్ డీ, క్యాల్షియ‌మ్ స‌మృద్ధిగా ఉంటుంది. పాల‌ను ప్ర‌తి రోజు పిల్ల‌ల‌కు తాగించాలి. పండ్ల‌ను, ఎముక‌ల‌ను బ‌లంగా ఉంచ‌డంలో పాలు కీల‌క‌పాత్ర వ‌హిస్తాయి. పిల్ల‌ల్లో ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌ను కూడా స‌మ‌తుల్యం చేస్తాయి పాలు. పాల‌ల్లో విట‌మిన్ డీ పుష్క‌లంగా ల‌భిస్తుంది కాబ‌ట్టి.. భ‌విష్య‌త్‌లో వ్యాధుల‌ను ద‌రి చేర‌నీయ‌కుండా కాపాడుకోవ‌చ్చు.

బ‌చ్చ‌లికూర

బ‌చ్చ‌లికూర అనేది పోష‌కాల‌కు నిల‌య‌మ‌ని చెప్పొచ్చు. విట‌మిన్ సీ, ఏ, కే పుష్క‌లంగా బ‌చ్చ‌లికూర‌లో ల‌భిస్తాయి. అత్య‌ధిక మోతాదులో క్యాల్షియ‌మ్, పోటాషియం, ఐర‌న్ ఉంటాయి. ఇవి పిల్ల‌ల పెరుగుద‌ల‌కు ఎంతో మేలు చేస్తాయి. మెద‌డు అభివృద్ధికి బ‌చ్చ‌లికూర మంచి ఆహారం. ర‌క్తంతో పాటు హిమోగ్లోబిన్ స్థాయిల‌ను పెంచుతుంది. బ‌చ్చ‌లి కూర‌లో ఉంటే యాంటి మైక్రోబ‌య‌ల్.. ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి దూరంగా ఉంచుతుంది. ఇక కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

క్యారెట్

క్యారెట్‌లో విట‌మిన్ ఏ అత్య‌ధిక మోతాదులో ల‌భిస్తుంది. ఇది పిల్ల‌ల‌కు ఆరోగ్య‌క‌ర‌మైన తిండి. కంటి స‌మ‌స్య‌లు రాకుండా చేస్తుంది. ఇత‌ర ఆర్గాన్ల పెరుగుద‌ల‌లో కూడా తోడ్ప‌తుంది. క్యారెట్‌లో పీచు ఎక్కువ‌గా ఉండ‌టంతో.. మ‌ల‌బ‌ద్ధ‌కాన్ని నిరోధిస్తుంది.

ఆరెంజ్

ఆరెంజ్ పండ్ల‌లో విట‌మిన్ సీ పుష్క‌లంగా ఉంటుంది. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొందిస్తుంది. ద‌గ్గు, జ‌లుబు నుంచి కూడా దూరం చేస్తుంది. ఫోలెట్, పొటాషియం వంటి పోష‌కాల‌ను కూడా క‌లిగి ఉంటాయి. శ‌రీరానికి కావాల్సిన ఐర‌న్‌ను కూడా ఇస్తాయి. పిల్ల‌ల దృష్టి కూడా మెరుగుప‌డుతుంది.

Exit mobile version