Site icon vidhaatha

Lemon Water | అధికంగా నిమ్మ ర‌సం తాగుతున్నారా..? అయితే దుష్ప్ర‌భావాలెన్నో..!

Lemon Water | గ‌త నాలుగైదు రోజుల నుంచి ఎండ‌లు( Summer ) దంచికొడుతున్నాయి. ఎండ‌లో ప‌ని చేసేవారు, ప్ర‌యాణాలు చేసే వారు త‌మ దాహం( Thirsty ) తీర్చుకునేందుకు నిమ్మ‌కాయ ర‌సాన్ని( Lemon Water ) ఎక్కువ‌గా తాగేస్తుంటారు. శ‌రీరం డీహైడ్రేష‌న్‌( Dehydration )కు గురికాకుండా నిమ్మ‌ర‌సం కాపాడుతుంది. ఎందుకంటే నిమ్మ‌లో ఉండే విట‌మిన్ సీ( Vitamin C ), యాంటీ ఆక్సిడెంట్స్ శ‌రీరంలోని వేడిని త‌గ్గించి, చ‌ల్ల‌గా ఉంచుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తిని కూడా పెంచుతుంది. అయితే నిమ్మరసం ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి.

శ‌రీరం నిర్జ‌లీక‌ర‌ణం..

ఎండాకాలంలో శ‌రీరాన్ని డీహైడ్రేష‌న్ నుంచి కాపాడుకునేందుకు నిమ్మ ర‌సాన్ని అధికంగా తాగుతుంటాం. అయితే నిమ్మ ర‌సాన్ని అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల్లో ఎక్కువ మూత్ర ఉత్ప‌త్తికి దారి తీస్తుంది. దీంతో మూత్ర విస‌ర్జ‌న ద్వారా శ‌రీరంలోని ఎల‌క్ట్రోలైట్ల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. త‌ద్వారా శ‌రీరం నిర్జ‌లీక‌ర‌ణానికి గుర‌వుతుంది. పెద‌వులు పొడిబారి పోవ‌డం, అల‌స‌ట వ‌స్తాయి. విప‌రీత‌మైన దాహం కూడా వేస్తుంది.

జీర్ణ స‌మ‌స్య‌లు..

నిమ్మ ర‌సం అధిక మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల గుండెల్లో మంట‌, క‌డుపునొప్పి, వికారం, గ్యాస్ ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డుతాయి. దీని కార‌ణంగా జీర్ణ స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. అధిక ఆమ్లత్వం కారణంగా నిమ్మకాయ నీరు కూడా అల్సర్లను ప్రేరేపిస్తుంది. నిమ్మకాయలోని ఎసిడిక్ కంటెంట్ కారణంగా పొట్ట, పేగు లోపలి పొరకు హాని కలిగిస్తుంది. దీని వల్ల అల్సర్లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది.

దంతాల‌కు ప్ర‌మాదం..

నిమ్మ‌ర‌సంలో ఉండే ఆమ్ల‌త్వం కార‌ణంగా.. ప‌ళ్ళు జ‌ల‌ద‌రించిన‌ట్లుగా అనిపిస్తుంది. ఇది దంతాల మీద ఉండే ఎనామిల్ క్షీణ‌త‌కు దారి తీస్తుంది. దంతాలు కూడా పుచ్చిపోయే ప్ర‌మాదం ఉంది. దీంతో నిమ్మ‌ర‌సాన్ని అధిక మోతాదులో తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది.

త‌ల‌నొప్పి తీవ్రం..

నిమ్మ జాతి ఫ‌లాల్లో టైర‌మెన్ ఎక్క‌వగా ఉంటుంది. దీంతో నిమ్మ‌ర‌సం ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల తీవ్ర‌మైన త‌ల‌నొప్పి, మైగ్రేన్ వ‌స్తాయి. కాబ‌ట్టి నిమ్మ ర‌సాన్ని త‌గ్గించుకుంటే మంచిది.

మ‌రి ఎన్ని గ్లాసుల నిమ్మ‌ర‌సం తాగాలి..?

ఆరోగ్య నిపుణులు సూచనల ప్రకారం ప్రతిరోజు రెండు గ్లాసుల నిమ్మరసం తాగితే మంచిది. ఎందుకంటే దానిలో నాలుగు నిమ్మకాయ ముక్కలతో లీటరు నీటిని చేర్చుకోవచ్చు. రోజుకు రెండు పూట‌ల్లో నిమ్మ‌ర‌సం తీసుకుంటే.. ఆరోగ్యంగా ఉండొచ్చు. అధిక మోతాదులో నిమ్మ‌ర‌సం తాగి అనారోగ్యాలు కొనితెచ్చుకోక‌పోవ‌డ‌మే మంచిది.

Exit mobile version