Seasonal Diseases | సీజ‌న‌ల్ వ్యాధుల‌తో జ‌ర జాగ్ర‌త్త‌.. ఈ జాగ్ర‌త్త‌లు పాటిస్తే ముప్పు త‌ప్పిన‌ట్టే..!

Seasonal Diseases | ఎండాకాలం ముగిసి వానాకాలం వ‌చ్చేసింది. వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇక వ‌ర్షాకాలంలో కొన్ని వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. వ‌ర్ష‌పు నీరు ఇండ్ల ప‌రిస‌రాల్లో నిలిచిపోవ‌డంతో.. అక్క‌డ దోమ‌ల వ్యాప్తి అధిక‌మ‌వుతుంది. ఈ దోమ‌లు మ‌న‌షుల‌ను కుట్ట‌డంతో అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఈ సీజ‌నల్ వ్యాధుల‌కు సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోతే, అవి ప్రాణాంతకంగా మారుతాయి.

  • Publish Date - July 4, 2024 / 09:07 AM IST

Seasonal Diseases | ఎండాకాలం ముగిసి వానాకాలం వ‌చ్చేసింది. వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇక వ‌ర్షాకాలంలో కొన్ని వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. వ‌ర్ష‌పు నీరు ఇండ్ల ప‌రిస‌రాల్లో నిలిచిపోవ‌డంతో.. అక్క‌డ దోమ‌ల వ్యాప్తి అధిక‌మ‌వుతుంది. ఈ దోమ‌లు మ‌న‌షుల‌ను కుట్ట‌డంతో అనేక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఈ సీజ‌నల్ వ్యాధుల‌కు సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోతే, అవి ప్రాణాంతకంగా మారుతాయి. మ‌లేరియా, డెంగ్యూ, చికెన్‌గున్యా వంటి వ్యాధుల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. కాబ‌ట్టి ఈ జాగ్ర‌త్త‌లు పాటిస్తే సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి ముప్పు త‌ప్పిన‌ట్లే అని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. మ‌రి ఆ జాగ్ర‌త్త‌లు ఏవో తెలుసుకుందాం.

తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే..

-ఇంటి త‌లుపులు, కిటికీలు మూసి ఉంచాలి. వీలైతే దోమ తెర‌లు వాడాలి.
-దోమ‌ల నివార‌ణ‌కు ఇత‌ర మార్గాల‌ను ఎంచుకోవాలి.
-ఇంటి పరిస‌రాల్లో వ‌ర్ష‌పు నీరు నిల్వ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాలి.
-వారానికి ఒక‌సారి డ్రై డే నిర్వ‌హించాలి.
-పూల‌కుండీలు, డ‌బ్బాలు, బ‌కెట్లు, కూల‌ర్స్‌లో ఉన్న నీటిని బ‌య‌ట‌కు తీసేయాలి.
-మూత్ర‌, మ‌ల విస‌ర్జ‌న చేసిన త‌ర్వాత స‌బ్బుతో శుభ్రంగా చేతుల‌ను క‌డుక్కోవాలి.
-వీలైనంత వ‌ర‌కు గోరువెచ్చ‌ని నీళ్ల‌ను తాగాలి.
-బ‌య‌టి ఆహారాన్ని అస‌లు తిన‌కూడ‌దు. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మూత లేకుండా ఉంచిన ఆహార ప‌దార్థాల జోలికి పోవ‌ద్దు.
-వీలైనంత వ‌ర‌కు ఇంట్లోనే వండుకుని, వేడివేడిగా తిన‌డం మంచిది.
-అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న వారికి దూరంగా ఉండండి.
-ద‌గ్గు, జ‌లుబు ఉన్న వారు ఇత‌రుల‌కు దూరంగా ఉంటే మంచిది.
-జ్వ‌రం మూడు రోజుల కంటే ఎక్కువ‌గా ఉంటే.. వెంట‌నే వైద్యుడిని సంప్ర‌దించాలి.

Latest News