Site icon vidhaatha

health emergency । తెలంగాణలో 2.93 లక్షల మందికి విష జ్వరాలు.. హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలన్న సీపీఎం

health emergency । గత నెల రోజులుగా రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులైన విషజ్వరాలు, మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వాటితో ప్రజలు అల్లాడిపోతున్నారని సీపీఎం తెలిపింది.  ప్రతి ఇంటిలో ఒకరు ఏదో ఒక వ్యాధికి గురయ్యారనడంలో ఆశ్చర్యం లేదన్నది. ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారమే 2.93లక్షల మంది వ్యాధుల బారిన పడ్డారని ప్రభుత్వం ప్రకటించిందని సీపీఎం పేర్కొన్నది.  లెక్కకు రాని వాటిని కలిపితే  ఈ సంఖ్య రెంట్టింపు వుంటుందన్నది.  డెంగ్యూ వ్యాధికి గురైన వారు వేల సంఖ్యలోనే వున్నారని, దీనికి తోడు ఈ వర్షాల వల్ల అంటువ్యాధులు ఇంకా విజృంభించే అవకాశం ఉన్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రభుత్వ ఆసునత్రులలో మందులు, ఇతర వైద్య సౌకర్యాలు తగినంతలేవని ఆరోపించారు.. దీన్ని అదనుగా  చేసుకుని ప్రయివేటు హాస్పటల్స్‌ రోగులను దోచుకుని అప్పులపాలు చేస్తున్నాయన్నారు. అందువల్ల రాష్ట్రంలో హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించి, వరద ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని, వ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నట్లు తమ్మినేని ఒక ప్రకటనలో తెలిపారు.

Exit mobile version