Curry Leaves Benefits | కూరలో కరివేపాకులా తీసేయడం… అంటూ ఉంటాం. కానీ నిజానికి మన ఆరోగ్యంలో మాత్రం ఏమాత్రం తీసివేయగూడనిది కరివేపాకు. ఔషధ గుణాలున్న మొక్కల్లో కరివేపాకు కూడా ఒకటి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలకు కరివేపాకు మంచి పరిష్కారం చూపుతుంది.
కరివేపాకులో ఫైబర్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ ఎ, బి, సి, ఇ మాత్రమే కాకుండా ఫ్లేవినాయిడ్స్, ఆల్కలాయిడ్స్ లాంటి పదార్థాలుంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ఎలా మేలు చేస్తుంది?
- అజీర్తి:
కరివేపాకు లోని ఫైటోకెమికల్స్ జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతాయి. తద్వారా ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. అందుకే అజీర్తి సమస్యలున్నవాళ్లకు కరివేపాకు మంచి మందు. - పేగుల శుభ్రతకు:
ఇందులో ఉండే ఫైబర్, మలాన్ని వదులుగా చేస్తుంది. అందువల్ల మలబద్ధకం తగ్గి పేగులు శుభ్రపడుతాయి. - కడుపుబ్బరం :
కొన్ని అధ్యయనాల ప్రకారం, కరివేపాకులో ఉండే ఆల్కలాయిడ్స్ ఆమ్ల ఉత్పత్తిని తక్కువ చేస్తాయి. అందువల్ల గ్యాస్ సమస్యలు, కడుపుబ్బరం నుంచి ఉపశమనం కలుగుతుంది. - లివర్ ఆరోగ్యానికి :
కరివేపాకు లివర్‌ను డిటాక్స్ చేయడంలో సహాయపడతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. జీర్ణ సంబంధిత సమస్యలకు రూట్ లెవల్ లో ఇది పరిష్కారం చూపిస్తుంది. - జర్నల్ ఆఫ్ ఎథ్నోఫార్మకాలజీలో ప్రచురితమైన అధ్యయనాల్లో కరివేపాకు యాంటీ అల్సరల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉన్నట్టుగా ఉంది.
- కరివేపాకులో ఉండే కార్బజోల్ ఆల్కలాయిడ్స్ క్రిములను అడ్డుకునే విధంగా పనిచేస్తాయి.
ఇలా కూడా వాడొచ్చు:
- తాజా కరివేపాకులను నులిపి రసం తాగితే, అజీర్ణం తగ్గుతుంది.
- నీటిలో కరివేపాకులను వేసి మరిగించి తాగడం కడుపుబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి.
- పచ్చడి లేదా పొడి రూపంలో రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా దీర్ఘకాలిక ఫలితాలు కనిపిస్తాయి.
జాగ్రత్తలు:
- అధిక మోతాదులో తీసుకుంటే వాంతులు లేదా జీర్ణసంబంధిత ఇబ్బందులు కలగవచ్చు.
- గర్భిణులు లేదా పాలిచ్చే తల్లులు ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది.
ఇవి కూడా చదవండి..
Boda Kakarakaya | కొత్తగా పెళ్లైన జంటలకు.. బోడ కాకరకాయ ఓ వరం..
Dengue Alert | డెంగ్యూ మళ్లీ వచ్చేసింది.. భద్రం!