Health tips : ప్రకృతి ప్రసాదించే ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అన్ని పండ్లలో అన్ని పోషకాలు ఉండకపోవచ్చు. కానీ ఏ పండు ప్రత్యేకత ఆ పండుకు ఉంటుంది. అదేవిధంగా ఏ ఒక్క అనారోగ్య సమస్యకు అన్ని పోషకాలు అక్కర్లేదు. కొన్ని సమస్యలకు కొన్ని పోషకాలు మాత్రమే చక్కటి పరిష్కారం చూపుతాయి. కాబట్టి మనలోని అనారోగ్య సమస్యను నిర్మూలించే పోషకాలు ఏ పండులో ఉంటాయో తెలుసుకుని తీసుకోవడం అవసరం. ఆ ప్రకారం చూస్తే చెర్రీ పండ్లలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే పోషకాలుంటాయి. అంతేగాక ఈ పండ్లతో ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రయోజనాలు
- చెర్రీ పండ్లలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలుంటాయి. చెర్రీలను తినటం వలన వివిధ రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. చెర్రీ పండ్లు తినటంవల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని అమాంతం పెంచుకోవచ్చు.
- చెర్రీ పండ్లలో ముఖ్యంగా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి అనారోగ్యం కలిగినప్పుడు ఈ పండ్లు తింటే వ్యాధులతో పోరాడే శక్తి మీకు సత్వరమే లభిస్తుంది.
- ఈ పండ్లతో జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. వ్యాయామం చేసిన తర్వాత వచ్చే కండరాల నొప్పులు, వాపులను కూడా తగ్గించడానికి చెర్రీలు ఎంతగానో దోహదం చేస్తాయి.
- అదేవిధంగా నిద్రలేమి సమస్యలతో బాధపడే వారు రోజుకు కొన్ని చెర్రీలను తినడం వలన నిద్ర బాగా పడుతుంది. చెర్రీ పండ్ల కంటే వాటితో చేసిన జ్యూస్‌లను తాగడంవల్ల నిద్ర హాయిగా పడుతుంది.
- చెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీ శరీరంలోని అధిక వేడిని తొలగిస్తాయి. ముఖ్యంగా శరీరంలో ఉండే ‘అధిక కొలెస్ట్రాల్’ను చెర్రీ పండ్లలోని పోషకాలు వెన్నలా కరిగిస్తాయి. తద్వారా మిమ్మల్ని గుండె జబ్బుల ప్రమాదం నుంచి బయటపడేస్తుంది.
- వీటన్నిటితోపాటు చెర్రీలలో ఆంథోసైనిన్స్ అనే ఒక రకమైన వర్ణకాలు ఉంటాయి. ఇవి మెదడు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. ఫలితంగా మతిమరుపు, అల్జీమర్స్ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
- చెర్రీ పళ్ళు తినటం వలన వృద్ధాప్యం దరిచేరదు, యవ్వనంగా కనిపిస్తారు. అంతేకాకుండా చెర్రీలను తినటం వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
ఇవి కూడా చదవండి
Health tips | వర్షాకాలంలో వీటిని తప్పక తీసుకోవాలి.. అస్సలు మిస్ చేయొద్దు..!
Health tips | మహిళలూ ఆ శుభ్రతపై అశ్రద్ధ అస్సలే వద్దు.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం..!
Health tips | తరచూ అవకాడో తింటే మధుమేహం మాత్రమే కాదు.. ఆ ఆరోగ్య సమస్యలన్నీ పరార్..!
Health tips | షుగర్ రోగులు తరచూ ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట..!
Health tips | ఈ పండ్ల జ్యూస్‌లు తరచూ తాగితే.. మీ జ్ఞాపకశక్తిని మీరే నమ్మలేరు..!
Health tips | మీలో ఈ లక్షణాలున్నాయా.. కిడ్నీలు ప్రమాదంలో పడ్డాయేమో.. పరీక్షలు చేయించుకోండి..!
Health tips | గుండె వ్యాధుల రిస్క్ తగ్గాలంటే ఎలాంటి డైట్ పాటించాలో తెలుసా..?