Site icon vidhaatha

Health tips | వర్షాకాలంలో వీటిని తప్పక తీసుకోవాలి.. అస్సలు మిస్‌ చేయొద్దు..!

Health tips : వర్షాకాలంలో నీరు కలుషితం కావడం కారణంగా, మురుగు పెరగడం, ఈగలు, దోమలు విజృంభించడం కారణంగా వ్యాధులు ప్రబలుతుంటాయి. మలేరియా (Malaria), టైఫాయిడ్‌ (Typhoid), డెంగ్యూ (Dengue) తదితర జ్వరాలు వ్యాపిస్తాయి. ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యం ఆహారంగా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యానికి మేలుచేసే ఆహార పదార్థాలనే ఎక్కువగా తీసుకోవాలి. ఇలా ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలేవో ఇప్పుడు తెలుసుకుందాం..

సిట్రస్‌ జాతి పండ్లు (Citrus fruits)

నిమ్మ, నారింజ, బత్తాయి లాంటి సిట్రస్ జాతి పండ్లలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్‌లు రాకుండా అరికడుతుంది. వీటిలోని ఎ, ఇ, డి, సి, బి విటమిన్లు.. జింక్, సెలీనియం, ఐరన్, కాపర్ తదితర ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్, అమైనో ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

పసుపు (Turmeric)

పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణం ఇమ్యూనిటీ సిస్టమ్‌ను బలంగా మారుస్తుంది. వంటింట్లో వాడే పసుపు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. పసుపులోని కర్కుమిన్ అనే పదర్థానికి యాంటీ సెప్టిక్ గుణం ఉంది. వర్షాకాలంలో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టాలంటే పసుపు పాలు అద్భుతంగా పనిచేస్తాయి. పాలల్లో పసుపు కలిపి తీసుకోవడంతో ఊపిరితిత్తుల్లో కఫం కరిగిపోయి శ్వాస తీసుకోవడం తేలికవుతుంది. యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా గల పసుపు తల నొప్పి నుంచి కూడా రిలీఫ్ కలిగిస్తుంది.

బచ్చలికూర (Spinach)

బచ్చలికూరలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్‌లను దూరం చేస్తాయి. బచ్చలి కూరలో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. బచ్చలి కూరలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంవల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తి కలుగుతుంది. అధిక రక్తపోటు ఉన్నవాళ్లకు మంచిది. ఇందులో సెలీనియం, నియాసిన్, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్‌ ఉంటాయి. ఊపిరితిత్తులకు మంచిది. ఇందులో ఉండే సాఫోనిన్ అనే పదార్థం క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది.

కాకారకాయ (Bitter guard)

కాకర కాయలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతాయి. కాకరకాయ తినడంవల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో వాపులు తగ్గుతాయి. డయాబెటిస్‌ నియంత్రణలో ప్రయోజనకరమైనది. జీర్ణక్రియకు ఉత్తమంగా పనిచేస్తుంది. బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. లివర్‌కు మేలు చేస్తుంది. చర్మ సమస్యలను దూరం చేస్తుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

అల్లం-వెల్లుల్లి (Ginger-Garlic)

అల్లంలోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు శ్వాససంబంధ సమస్యలను దూరం చేస్తాయి. వెల్లుల్లిలోని యాంటీవైరల్ లక్షణం జలుబు, ఇన్‌ఫెక్షన్‌లను అడ్డుకుంటుంది. అల్లం, వెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అల్లం, వెల్లుల్లిని సూప్‌లో, వంటల్లో వాడుకోవచ్చు. టీలు, చాయ్‌లు చేసుకుని తీసుకోవచ్చు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలోని ఔషధ గుణాలు క్యాన్సర్‌ను నియంత్రిస్తాయి. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, అధిక చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

Health tips | తరచూ అవకాడో తింటే మధుమేహం మాత్రమే కాదు.. ఆ ఆరోగ్య సమస్యలన్నీ పరార్‌..!

Health tips | షుగర్‌ రోగులు తరచూ ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట..!

Health tips | ఈ పండ్ల జ్యూస్‌లు తరచూ తాగితే.. మీ జ్ఞాపకశక్తిని మీరే నమ్మలేరు..!

Health tips | మీలో ఈ లక్షణాలున్నాయా.. కిడ్నీలు ప్రమాదంలో పడ్డాయేమో.. పరీక్షలు చేయించుకోండి..!

Health tips | గుండె వ్యాధుల రిస్క్‌ తగ్గాలంటే ఎలాంటి డైట్‌ పాటించాలో తెలుసా..?

Health tips | వానాకాలం ఇన్‌ఫెక్షన్‌లకు గుడ్‌బై చెప్పాలంటే.. మీ డైలీ డైట్‌లో ఈ పండ్లు ఉండాల్సిందే..!

Exit mobile version