పోష‌కాలు మెండు.. వింట‌ర్ ల‌డ్డూ

విధాత: ప్ర‌స్తుత కాలంలో పిల్ల‌లే కాదు పెద్ద‌లు కూడా బ‌ల‌వ‌ర్ధ‌క ఆహారం తీసుకోవ‌ట్లేదు. వారికుండే పని ఇతరత్రా కారణాలతో వాటిని పట్టించుకోవడమే మరిచారు. ముఖ్యంగా నేటి పిల్ల‌లు జంక్ పుడ్‌, బ‌య‌ట ల‌భించే చిరుతిళ్ల‌నే ఎక్కువ‌గా తింటారు. దీంతో పోష‌కాలు అంద‌క‌పోవ‌డ‌మే కాకుంగా అనారోగ్యం పాల‌వ్వాల్సిన ప‌రిస్థితి. ఇంట్లోనే నిమిషాలలోనే సులువుగా చేసుకునే పదార్ధాలు ఉన్నప్పటికీ మనకు వాటిని చేసుకుని తినడానికి ఆసక్తి అసలు ఉండదు. పైపెచ్చు ఆర్గానిక్‌, మిల్లెట్‌ ఫుడ్స్‌ అంటూ హోటళ్లు, రెస్టారెంట్లలో ఉండే […]

  • Publish Date - November 16, 2022 / 08:38 AM IST

విధాత: ప్ర‌స్తుత కాలంలో పిల్ల‌లే కాదు పెద్ద‌లు కూడా బ‌ల‌వ‌ర్ధ‌క ఆహారం తీసుకోవ‌ట్లేదు. వారికుండే పని ఇతరత్రా కారణాలతో వాటిని పట్టించుకోవడమే మరిచారు. ముఖ్యంగా నేటి పిల్ల‌లు జంక్ పుడ్‌, బ‌య‌ట ల‌భించే చిరుతిళ్ల‌నే ఎక్కువ‌గా తింటారు. దీంతో పోష‌కాలు అంద‌క‌పోవ‌డ‌మే కాకుంగా అనారోగ్యం పాల‌వ్వాల్సిన ప‌రిస్థితి.

ఇంట్లోనే నిమిషాలలోనే సులువుగా చేసుకునే పదార్ధాలు ఉన్నప్పటికీ మనకు వాటిని చేసుకుని తినడానికి ఆసక్తి అసలు ఉండదు. పైపెచ్చు ఆర్గానిక్‌, మిల్లెట్‌ ఫుడ్స్‌ అంటూ హోటళ్లు, రెస్టారెంట్లలో ఉండే ఫ్లెక్షీలు, బ్యానర్లు చూసి అవి తెచ్చుకుని తిని మనం ఆరోగ్యం పొందినట్టేనని అనుకునే వారి సంఖ్య అధికంగా ఉంటుంది.

ఇకపోతే.. ఇంట్లో బలవర్ధకపు ఆహరం సొంతంగా తయారు చేసుకోవాలనుకునే వారికి మేం అందించే ఓ రెసిపీ ఉపయోగకరంగా ఉంటుందని బావిస్తున్నాం. ఇది మన ఆరోగ్యానికి చాలా లాభదాయకమైనది కూడా.

వ‌ర్షాకాలం, వేస‌విల‌తో పోల్చితే చ‌లికాలంలో శ‌రీరంలో ఉష్ణోగ్ర‌త త‌గ్గి చ‌ర్మం పొడి బార‌డం త‌దిత‌ర స‌మ‌స్య‌లు వేదిస్తాయి. అలాంటి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ ప‌డాల‌న్నా.. అధిక‌ పోష‌కాలు ల‌భించాల‌న్నా ‘వింట‌ర్ ల‌డ్డూ’ను ఆశ్ర‌యించాల్సిందే. మ‌రి ఆ ల‌డ్డూని ఎలా త‌యారు చేయాలి.. అందుకు ఏఏ ప‌దార్థాలు కావాలో తెలుసుకుందాం ప‌దండి.. – తిప్ప‌న సంధ్యారాణి

కావాల్సిన ప‌దార్ధాలు
పూల్ మ‌కాన – పావు కిలో
బాదం – పావుకిలో
పిస్తా – 50 గ్రాములు
ఆక్రూట్ – 100 గ్రాములు
జీడిప‌ప్పు – 100 గ్రాములు
ఎండు ఖ‌ర్జూర – 100 గ్రాములు
మిన‌ప ప‌ప్పు – 200 గ్రాములు
సొంటి – 05 గ్రాములు
మిర్యాలు – 20
ల‌వంగాలు – 10
పిప్ప‌ళ్ల పొడి – 01 గ్రాము(ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది)
గోధుమ పిండి – 50 గ్రాములు
తినే గ‌మ్ – 25 గ్రాములు( డ్రైఫ్రూట్ షాపులు, సూప‌ర్‌మార్కెట్‌ల‌లో దొరుకుతుంది)
బెల్లం పౌడ‌ర్ – కిలో
ఆవునెయ్యి – 350 గ్రాములు
కుంకుమ పువ్వు కొద్దిగా…

త‌యారీ విధానం

స్టౌ మీద క‌డాయి పెట్టి మిన‌ప ప‌ప్పును దోర‌గా వేయించి ప‌క్క‌న పెట్టుకోవాలి, అదే క‌డాయిలో పావు కిలో నెయ్యి వేసి కాస్త వేడి ఎక్కాక పూల్ మ‌కాన‌ను దోర‌గా వెయించి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఆ త‌రువాత 50 గ్రాముల నెయ్యి వేసి తినే గ‌మ్‌ను వేయించి తీసి మిగిలిన నెయ్యిలో గోధుమ పిండిని దోర‌గా వేయించి ప‌క్క‌న పెట్టుకోవాలి.

అనంత‌రం ముందుగా వేయించిన మిన‌ప ప‌ప్పు, ల‌వంగాలు, సొంటి, మిర్యాలు, పిప్ప‌ళ్ల పొడి, బెల్లం పౌడ‌ర్‌, కుంకుమ పువ్వు మిక్సీ ప‌ట్టుకోవాలి. ఆ త‌రువాత బాద‌మ్‌, పిస్తా, ఆక్రూట్‌, జీడిప‌ప్పు, ఎండు ఖ‌ర్జూర‌(ముందుగా గింజ‌లు తీసివేయాలి), వీటిని ఒక్కొక్క‌టిగా గ్రైండ్ చేసి ప‌క్క‌న పెట్టుకోవాలి. చివ‌రిగా పూల్ మ‌కాన, తినే గ‌మ్ విడివిడిగా మిక్సీ ప‌ట్టుకోవాలి.

అనంత‌రం వీట‌న్నింటినీ ఒక పెద్ద గిన్నెలో వేసి బాగా క‌లిసేట‌ట్టుగా క‌లుపుకొని ల‌డ్డూలు క‌ట్టుకోవాలి. ల‌డ్డూ ముద్ద అవ్వ‌కుండా విడిపోతున్న‌ట్లు అనిపిస్తే మిగిలిన నెయ్యిని కొద్ది కొద్దిగా వేస్తూ స‌రి చూసుకొని ల‌డ్డూలు చుట్టుకోవాలి. పై కొల‌త‌ల‌తో 70 ల‌డ్డూలు అవుతాయి.

అధిక పోష‌క విలువ‌లు క‌లిగిన‌, ఆరోగ్య‌క‌ర‌మైన‌, చ‌లికాలంలో శ‌రీరానికి వేడిని ఇచ్చే వింట‌ర్ ల‌డ్డూ సిద్ధం. చాలా మంది పిల్ల‌లు ఇంట్లో త‌యారు చేసిన పిండి వంట‌లు తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ఎక్కువ‌గా ఫిజ్జా, బ‌ర్గ‌ర్‌, చిప్స్, లేస్, కుర్‌కురే లాంటి రెడీమేడ్ చిరుతిళ్లు తిన‌డానికి మాత్ర‌మే ఇష్ట‌ప‌డ‌తారు. కానీ వింట‌ర్ ల‌డ్డూను మాత్రం పిల్ల‌లు చాలా ఇష్టంగా తింటారు.

ప్ర‌యోజ‌నాలు

న్యూట్రీషియ‌న్ డెఫిసిటీ ఉన్న‌వాళ్ల‌కు చాలా ఉప‌యోగ‌క‌రం
పూల్‌మ‌కానతో కాల్షియం, మెగ్నీషియం, ఐర‌న్ పుష్క‌లంగా ల‌భిస్తుంది.
ర‌క్త‌పోటును నియంత్రణ‌లో ఉంచుతుంది.
పిప్ప‌ళ్ల వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు నుంచి ఉపశ‌మ‌నం ల‌భిస్తుంది.

Latest News