Health tips | వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే.. వీళ్లు మాత్రం అస్సలు తినొద్దు..!

Health tips : సాధారణంగా వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే. ప్రతిరోజు వెల్లుల్లిని మన ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వెల్లుల్లి మన జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటును అదుపుచేస్తుంది. కడుపులో ఉండే టాక్సిన్స్‌ను బయటకు పంపేందుకు వెల్లుల్లి తోడ్పడుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అందుకే ఆయుర్వేదంలో వెల్లుల్లిని ఎక్కువగా ఉపయోగిస్తారు.

  • Publish Date - June 30, 2024 / 02:05 PM IST

అయితే రోజూ వెల్లుల్లి తినడంవల్ల ఆరోగ్యానికి మంచిదే అయినా కొన్ని రకాల సమస్యలు ఉన్నవాళ్లకు మాత్రం పడదని నిపుణులు చెబుతున్నారు. ఎసిడిటీతో బాధపడేవారు పచ్చి వెల్లుల్లిని తినకూడదు. పరగడుపున అయితే అస్సలే తినకూడదు. ఎసిడిటీతో బాధపడుతూ పచ్చి వెల్లుల్లి తింటే జీర్ణ సంబంధ సమస్యలు పెరుగుతాయి. కడుపులో అల్సర్స్ ఏర్పడే ప్రమాదం ఉంది.

అదేవిధంగా చర్మ సమస్యలు ఉన్నవాళ్లకు కూడా వెల్లుల్లి మంచిది కాదు. కాబట్టి స్కిన్ ఎలర్జీలు ఉన్నవాళ్లు పచ్చి వెల్లుల్లి వాడకూడదు. అంతేగాక కడుపు ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, గుండెల్లో మంట లాంటి సమస్యలతో బాధపడేవారు కూడా పచ్చి వెల్లుల్లికి దూరంగా ఉండాలి. వెల్లుల్లిలో రక్తాన్ని పలుచన చేసే గుణాలు ఉంటాయి. కాబట్టి ఇది గుండె ఆరోగ్యానికి మంచిదే. కానీ గుండెలో మంట ఉంటే వెల్లుల్లితో ఇంకా ఎక్కువవుతుంది.

ఏవైనా శస్త్ర చికిత్సలు చేయించుకున్నవాళ్లకు కూడా పచ్చి వెల్లుల్లి మంచిది కాదు. పచ్చి వెల్లుల్లి తినడంవల్ల శస్త్ర చికిత్స చేయించుకున్న వాళ్లలో రక్తస్రావం సమస్య పెరుగుతుంది. రక్తహీనత, లోబీపీ ఉన్నవాళ్లు కూడా పచ్చి వెల్లుల్లిని తినకూడదు. అలాంటి అనారోగ్యాలతో వెల్లుల్లి తింటే సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.

Latest News