Sugarcane Vs Coconut Water | ఎండలు( Summer ) దంచికొడుతున్నాయి. భానుడి( Sun ) భగభగలకు జనాలు విలవిలలాడిపోతున్నారు. భారీగా ఉష్ణోగ్రతలు( Temperatures ) నమోదు అవుతున్నాయి. ఎండలకు శరీరం అలసటకు గురవుతుంది. వేడిమికి శరీరం డీహైడ్రేట్( Dehydrate ) కూడా అవుతోంది. ఈ క్రమంలో డీహైడ్రేట్‌ను అధిగమించేందుకు ద్రవ పదార్థాలను( Liquids ) తీసుకునేందుకు ఇష్టపడుతుంటారు. ఈ ద్రవ పదార్థాల్లో అధికంగా కొబ్బరి నీళ్లు( Coconut Water ), చెరుకు రసం( Sugarcane ), పుదీనా జ్యూస్, నిమ్మ రసం( Lemon ), ఓఆర్ఎస్( ORS ) వంటి ద్రవ పదార్థాలను తీసుకుంటారు. అయితే వీటిలో చెరుకు రసం, కొబ్బరి నీళ్లు ఎక్కడంటే ఎక్కడ లభ్యమవుతున్నాయి. ఈ రెండింటినే ఎక్కువగా తాగేస్తున్నారు జనాలు. మరి ఈ రెండింటిలో ఏది బెటరో తెలుసుకుందాం..
చెరుకు రసం, కొబ్బరి నీళ్లు రెండూ అద్భుతమైన సహజ వేసవి పానీయాలు. రెండూ వేర్వేరు ప్రయోజనాలను అందిస్తాయి. తక్షణ శక్తి కోసం అయితే చెరుకు రసం బెస్ట్.. రోజువారీ హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, తక్కువ కేలరీల ప్రత్యామ్నాయం కోసం కొబ్బరి నీళ్లు మంచిది.
చెరుకు రసం.. ( Sugarcane )
- చెరుకు రసం అద్భుతమైన వేసవి పానీయం.. తక్షణ శక్తిని అందించి శరీరాన్ని చల్లబరుస్తుంది.
- చక్కెరలతో సమృద్ధిగా ఉండడంతో ప్రభావవంతమైన శక్తి వనరుగా పని చేస్తుంది.
- శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి ఇవ్వడంలో సహాయపడుతుంది.
- డీహైడ్రేషన్, అలసటను నివారించడంలో తోడ్పడుతుంది.
- చెరుకు రసంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడే పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి.
- చెరుకు రసంలో ఉండే ఫైబర్, సహజ ఎంజైమ్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
- యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
కొబ్బరి నీళ్లు..( Coconut Water )
- కొబ్బరి నీళ్లు శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతాయి.
- కొబ్బరి నీళ్లల్లో అద్భుతమైన హైడ్రేటింగ్ లక్షణాలు, పోషకాలు ఉంటాయి.
- ఇవి ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి, కండరాల తిమ్మిరిని నివారించడానికి సహాయపడుతాయి.
- చెరుకు రసం మాదిరి కాకుండా.. కొబ్బరి నీటిలో సహజ చక్కెర, కేలరీలు తక్కువగా ఉంటాయి.
- జీర్ణక్రియకు సహాయపడుతాయి.
- కొబ్బరి నీళ్లు చర్మాన్ని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచుతుంది.
- రక్తపోటు, కిడ్నీలో రాళ్ల నివారణకు కొబ్బరి నీళ్లు సహాయపడుతాయి.