విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాధ్ బుధవారం తన మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ భవన్ నుంచి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి ఆమె షేక్ పేట తహశీల్ధార్ కార్యాలయానికి చేరుకుని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ వేయడానికి ముందు సునీత జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు.
సునీత వెంట కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, సీనీయర్ నాయకులు పి.విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి, దీదీప్య రావు, రాజ్‌కుమార్ పటేల్, సమీనా యాస్మిన్ ప్రభృతులు ఉన్నారు.