Gold Rate in Hyderabad Today (22 November 2025): 24K at ₹12,584, 22K at ₹11,535
(విధాత బిజినెస్ డెస్క్) హైదరాబాద్:
హైదరాబాద్‌లో బంగారం రేట్లు తిరిగి పైపైకి ఎగబాకుతున్నాయి. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న రైజింగ్ ట్రెండ్ నవంబర్‌లో కూడా కొనసాగుతునేఉంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి డాలర్–రూపాయి మార్పులు వరకు పలుఅంశాల ప్రభావంతో 24 క్యారెట్ ధరలు కొత్త రికార్డులను తాకుతున్నాయి.
హైదరాబాద్‌లో బంగారం ధర సూర్యుడిగా ధగధగా ప్రకాశిస్తోంది.
22 నవంబర్ 2025 నాటికి హైదరాబాద్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం గ్రాము ధర ₹12,584కి చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ₹11,535, 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ₹9,438గా నమోదైంది. నిన్నటితో పోల్చితే 24 క్యారెట్‌లపై గ్రాముకు ₹186, 22 క్యారెట్‌లపై ₹170, 18 క్యారెట్‌పై ₹139 పెరుగుదల కనిపించింది.
నేటి రేట్లను బరువుల వారీగా చూస్తే 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు ₹1,25,840, 22 క్యారెట్ 10 గ్రాములు ₹1,15,350, 18 క్యారెట్ 10 గ్రాములు ₹94,380 వద్ద ట్రేడవుతోంది. అయితే ఇవి GST, TCS, ఇతర లెవీలు లేకుండా సూచనాత్మక రేట్లు మాత్రమే. నిజంగా ఆభరణం కొనేటప్పుడు బిల్లులో మేకింగ్ చార్జీలు, తదితరాలు కలిపి మొత్త ధర మరింత పెరగొచ్చు.
బంగారం ధరల్లో రోజువారీ మార్పులు, మూడు నెలల ట్రెండ్
గత 10 రోజుల సమాచారాన్ని పరిశీలిస్తే, హైదరాబాద్‌లో బంగారం రేట్లు స్పష్టంగా అస్థిమితంగా కదిలాయి. నవంబర్ 13న 24 క్యారెట్ల గ్రాము ₹12,862, 22 క్యారెట్ల గ్రాము ₹11,790తో ఈ నెలలో అత్యధిక స్థాయికి చేరగా, నవంబర్ 5న 24 క్యారెట్ల ₹12,148, 22 క్యారెట్ల ₹11,135తో నెలలో కనిష్టాన్ని తాకింది. నవంబర్ 1న 22 క్యారెట్ల ధర గ్రాముకు ₹11,275 నుంచి నేటి ₹11,535కి, 24 క్యారెట్ల ధర ₹12,300 నుంచి ₹12,584కి పెరగడం వల్ల ఈ నెలలో సుమారు 2.31% పెరుగుదల నమోదైంది. అక్టోబర్‌లో కూడా 22 క్యారెట్ ₹10,930 నుంచి ₹11,300కి, 24 క్యారెట్ ₹11,924 నుంచి ₹12,328కి పెరిగి సుమారు 3.39% హెచ్చుదల ఇచ్చింది. సెప్టెంబర్‌లో అయితే ఈ ట్రెండ్ మరింత దూకుడుగా ఉండి, నెల ఆరంభంలో 24 క్యారెట్ల గ్రాము ₹10,588 నుంచి నెలాఖరుకు ₹11,744కి చేరి దాదాపు 11%కు దగ్గరగా భారీ లాభం చూసింది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇలా వరుసగా చూస్తే, జూన్‌లో స్వల్ప మైనస్ తరువాత బంగారం నిరంతరం ‘రైజింగ్ ట్రెండ్’లోనే కదులుతోంది.
సగటు రేట్లను చూస్తే గత 10 రోజులకు 24 క్యారెట్ సగటు ₹12,538, ఒక ఏడాది సగటు ₹9,798, 3 ఏళ్ల సగటు ₹7,577 వద్ద ఉండగా, నేటి రేట్ ₹12,584 కావడం ద్వారా దీర్ఘకాలికంగా బంగారం పెట్టుబడి ఎంత బలంగా రాబడి ఇచ్చిందో స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రపంచవ్యాప్త ప్రభావం–హైదరాబాద్ బంగారం రేట్లు
హైదరాబాద్‌లో బంగారం ధరలు స్థానిక డిమాండ్‌కే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లపై ఆధారపడ్డాయి. ప్రపంచ బంగారం ధరలు, డాలర్–రూపాయి మార్పులు, సెంట్రల్ బ్యాంకుల రిజర్వ్ విధానాలు, వడ్డీ రేట్ల నిర్ణయాలు ధరలను ప్రభావితం చేస్తాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే సూచనలు వచ్చినప్పుడల్లా బంగారం మీద ఒత్తిడి పడుతుంది. కానీ ప్రపంచ రాజకీయ పరిస్థితులు, యుద్ధ భయాలు, మార్కెట్ గందరగోళం ఉన్నప్పుడు మదుపరులు మళ్లీ సురక్షిత పెట్టుబడిగా బంగారానికే మొగ్గుచూపుతారు, దాంతో ధరలు ఆకాశాన్నంటుతాయి. దేశీయంగా పండుగలు, వివాహాల సీజన్‌లో నగల డిమాండ్ పెరగడం వల్ల మేకింగ్ చార్జీలు కలిసినప్పుడు వినియోగదారుడి ఖర్చు మరింత పెరుగుతుంది. పెట్టుబడిదారులు జ్యువెలరీ కంటే బులియన్, నాణేలు, ETFs, సావరిన్ గోల్డ్ బాండ్స్‌ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.
దీర్ఘకాలికంగా బంగారం పెట్టుబడి స్థిరంగా కొనసాగుతున్న నేపథ్యంలో కొనుగోలు ముందు నేటి లైవ్ రేట్, గ్లోబల్ అప్‌డేట్స్, రూపాయి మార్పులను పరిశీలించడం మంచిది
