ఫోన్ ట్యాపింగ్ దోషులను వదిలిపెట్టం : మంత్రి జూపల్లి

ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులను వదిలిపెట్టేది లేదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

Jupally Krishna Rao

విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, వారిని చట్టపరంగా శిక్షించేలా చూస్తామని తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ నుంచి కేటీఆర్ వరకు అందరూ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ఒప్పుకున్నారు అని, మరి ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపు అంటూ ఈ దొంగ ఏడుపులు ఏంది? అని జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. కేటీఆర్, హరీష్ రావులను కేవలం సాక్ష్యులుగా మాత్రమే విచారణకు పిలిచారని గుర్తు చేశారు.

ట్యాపింగ్ ఎందుకు జరిగింది..ఎలా జరిగిందన్న సమాచారంపై ప్రశ్నించేందుకు వారిని విచారించారని తెలిపారు. ట్యాపింగ్ కేసులో పాత్రదారులు సూత్రదారులు ఎవరో తేల్చేందుకు విచారణ జరుగుతుందని, విచారణకు అన్ని పార్టీల బాధితులను పిలిచారని, దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని జూపల్లి విమర్శించారు. ప్రజాస్వామ్య బద్దంగా విచారణ జరుగుతుందని, వేల సంఖ్యలో ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ప్రజలకు కూడా తెలియాల్సి ఉందన్నారు.

ఇవి కూడా చదవండి :

Donald Trump | ట్రంప్ చేతిపై కమిలిన గాయాలు.. అధ్యక్షుడి ఆరోగ్యంపై మరోసారి చర్చ..!
Viral Video | అమెజాన్ అడవుల్లో అతిపెద్ద అనకొండ వీడియో వైరల్

Latest News