Journalist Accreditation : అక్రిడిటేషన్లు మరో రెండు నెలలు పొడిగింపు

తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువును 2026 ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. కొత్త నిబంధనలతో త్వరలోనే కార్డులు జారీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Journalist Accreditation

విధాత, హైదారబాద్ : తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రిడిటేషన్లను మరో రెండు నెలలు పొడిగించింది. ఫిబ్రవరి 28వరకు ప్రస్తుత అక్రిడిటేషన్ల గడువును పెంచింది. ఈ మేరకు సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్.ప్రియాంక ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే త్వరలోనే కొత్త అక్రిడిటేషన్లను జారీ చేస్తామని ఉత్తర్వులో స్పష్టం చేశారు.

ఇటీవలే ప్రభుత్వం కొత్త అక్రిడిటేషన్ల కోసం ‘తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్-2025’ తో జీవో నంబర్ 252ను విడుదల చేసింది. రాష్ట్ర స్థాయి (SMAC) , జిల్లా స్థాయి (DMAC) అక్రెడిటేషన్ కమిటీల పదవీ కాలం రెండేళ్లుగా నిర్ణయించారు. అదే విధంగా కొత్త కమిటీలు ఏర్పాటయ్యే వరకు పాతవే కొనసాగుతాయని తెలిపారు. ఫీల్డ్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డు, డెస్క జర్నలిస్టులకు మీడియా కార్డులను జారీ చేయాలని నిర్ణయించారు. కొత్తగా డిజిటల్ మీడియా కు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి :

Telecom Revolution NFAP 2025 | టెలికం సేవల్లో కొత్త విప్లవం.. 6జీ సేవల దిశగా కీలక అడుగు.. మొబైల్‌ మార్చుకోవాలా?
Mohanlal | మలయాళీ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఇంట్లో విషాదం.. సంతాపం తెలిపిన ప్ర‌ముఖులు

Latest News