విధాత, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ జీవో 252 లో సవరణలు చేస్తూ జీవో ఆర్టీ.నంబర్ 103 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే అక్రిడిటేషన్లు ఉన్న జర్నలిస్టులు మాత్రమే వాహనాలపై PRESS ఉపయోగించాలని తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ మెమో జారీ చేయడం గమనార్హం
అక్రిడిటేషన్ కార్డుల జారీ జీవోలో తెచ్చిన సవరణలు (Telangana accreditation GO amendments)
* డెస్క్ జర్నలిస్టులకు జారీ చేసే అక్రిడిటేషన్ కార్డుల్లో తప్పనిసరిగా మహిళలకు 33% జారీ చేయాలి.
* డెస్క్ జర్నలిస్టులకు ఇస్తామన్న మీడియా కార్డుకు బదులు అక్రిడిటేషన్ పేరిట కార్డు జారీ చేయాలి.
* 2.5 లక్షల సర్క్యులేషన్ పత్రికలకు మండల స్థాయిలో 1.5 లక్షల జనాభా ఉంటే అదనంగా మరొక అక్రిడిటేషన్ కార్డు జారీ చేయాలి.
* 2.5 లక్షలు ఉన్న పత్రికల్లో స్పోర్ట్స్, కల్చరల్, ఫిలిం విభాగంలో పనిచేసే జర్నలిస్టులకు అదనంగా అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలి.
* 75001 నుంచి 2.5 లక్షల వరకు సర్కులేషన్ గల పత్రికలకు రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్, కల్చరల్, ఫిలిం విభాగంలో పనిచేసే జర్నలిస్టులకు అదనంగా అక్రిడిటేషన్లు జారీ చేయాలి.
* ఉర్దూ బిగ్ డైలీ కి బదులు ఉర్దూ దినపత్రికగా మార్పు చేశారు.
* రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీ లో అదనంగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రతినిధి ఒకరు, పెద్ద దినపత్రికల్లో పని చేసే ఒక డెస్క్ జర్నలిస్టుకు అవకాశం కల్పించారు.
