తొలి కాన్పులోనే ఆరుగురు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన 27 ఏండ్ల మ‌హిళ‌

సాధార‌ణంగా ఒక కాన్పులో ఒక‌రికి జ‌న్మ‌నిస్తారు. క‌వ‌ల‌లు చాలా త‌క్కువ‌గా జ‌న్మిస్తుంటారు. అయితే ఓ మ‌హిళ మాత్రం తొలి కాన్పులోనే ఆరుగురు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఆరుగురిలో ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు, న‌లుగురు మ‌గ‌పిల్ల‌లు ఉన్నారు.

  • Publish Date - April 21, 2024 / 11:29 AM IST

సాధార‌ణంగా ఒక కాన్పులో ఒక‌రికి జ‌న్మ‌నిస్తారు. క‌వ‌ల‌లు చాలా త‌క్కువ‌గా జ‌న్మిస్తుంటారు. అయితే ఓ మ‌హిళ మాత్రం తొలి కాన్పులోనే ఆరుగురు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఆరుగురిలో ఇద్ద‌రు ఆడ‌పిల్ల‌లు, న‌లుగురు మ‌గ‌పిల్ల‌లు ఉన్నారు. ఈ ఘ‌ట‌న పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ఏప్రిల్ 19వ తేదీన వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. రావల్పిండికి చెందిన జీన‌త్ వాహిద్(27) అనే మ‌హిళ‌కు నెల‌లు నిండాయి. దీంతో గురువారం రాత్రి ఆమెకు పురిటినొప్పులు వ‌చ్చాయి. గ‌ర్భిణిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. క‌డుపులో ఆరుగురు పిల్ల‌లు ఉన్నార‌ని చెప్పి.. స‌ర్జ‌రీ నిర్వ‌హించి డెలివ‌రీ చేశారు.

ఆరుగురు పిల్ల‌లు త‌క్కువ బ‌రువుతో జ‌న్మించిన‌ప్ప‌టికీ ఆరోగ్యంగా ఉన్నార‌ని డాక్ట‌ర్లు తెలిపారు. త‌ల్లి ఆరోగ్యానికి ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం పిల్ల‌ల‌ను నియోనాట‌ల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ప్ర‌తి 4.5 మిలియ‌న్ గ‌ర్భిణుల్లో ఒక‌రికి ఇలా జ‌రుగుతుంద‌ని వైద్యులు పేర్కొన్నారు. ఒకే కాన్పులో ఆరుగురికి జ‌న్మ‌నివ్వ‌డం క‌ష్టంతో కూడుకున్న ప‌నే. అయిన‌ప్ప‌టికీ త‌ల్లీపిల్ల‌లు ఆరోగ్యంగా ఉన్నార‌ని డాక్ట‌ర్లు స్ప‌ష్టం చేశారు. 1974లో తొలిసారిగా సౌతాఫ్రికాలో ఒకే కాన్పులో ఓ మ‌హిళ ఆరుగురు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది.

Latest News