నోబెల్​ దక్కని ట్రంప్​కు ఊరటనిచ్చిన ఇజ్రాయెల్​, ఈజిప్ట్​ అత్యున్నత పౌర పురస్కారాలు

నోబెల్‌ శాంతి బహుమతి రాకపోయినా ట్రంప్‌కి ఇజ్రాయెల్‌, ఈజిప్టు ప్రభుత్వాలు అత్యున్నత గౌరవాలు అందిస్తున్నాయి. గాజా శాంతి, బందీల విడుదలలో ఆయన పాత్ర ప్రశంసనీయం.

Trump Receives Israel and Egypt’s Top Civilian Awards After Missing Nobel Peace Prize

Israel, Egypt to present their highest civilian honours to U.S. President Donald Trump

వాషింగ్టన్‌: నోబెల్‌ శాంతి బహుమతి రాకపోవడంతో నిరాశ చెందిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కి ఊరటగా మరో రెండు అత్యున్నత గౌరవాలు లభించనున్నాయి. గాజా ప్రాంతంలో యుద్ధ విరమణ కుదర్చడం, బందీల విడుదలలో కీలకపాత్ర పోషించడం కారణంగా ఇజ్రాయెల్‌ మరియు ఈజిప్టు ప్రభుత్వాలు ఆయనను తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించనున్నట్లు ప్రకటించాయి.

ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు ఇస్సాక్‌ హెర్జోగ్‌ ప్రకటన ప్రకారం,  ట్రంప్‌కి ‘ప్రెసిడెన్షియల్‌ మెడల్‌ ఆఫ్‌ ఆనర్‌(Presidential Medal of Honour)’ అవార్డును ప్రదానం చేయనున్నారు. దేశ భద్రత, శాంతి, మరియు బందీల విముక్తికి ఆయన చేసిన కృషిని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని హెర్జోగ్‌ తెలిపారు. మరోవైపు ఈజిప్టు ప్రభుత్వం కూడా ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది నైల్‌ (Order of the Nile)’ అనే తమ అత్యున్నత గౌరవాన్ని ట్రంప్‌కి ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

ట్రంప్‌ గతంలో తనకు నోబెల్‌ శాంతి బహుమతి రావాలని బహిరంగంగా చెప్పుకున్న విషయం తెలిసిందే. తాను ఏడు యుద్ధాలను ఆపానని, కోట్లాది ప్రాణాలను కాపాడానని గర్వంగా ప్రకటించారు. భారత్‌–పాకిస్థాన్‌, గాజా–ఇజ్రాయెల్‌ వంటి వివాదాల పరిష్కారంలో తాను కీలకపాత్ర పోషించానని చెప్పుకొచ్చారు. తాజాగా గాజా శాంతి ఒప్పందం, హమాస్‌ బందీల విడుదల చర్యలతో ఆయన చేసిన ప్రయత్నాలు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నాయి.

ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు హెర్జోగ్‌ మాట్లాడుతూ , ట్రంప్‌ ఇజ్రాయెల్‌కు అందించిన అచంచల మద్దతు, శాంతి పునరుద్ధరణలో ఆయన చేసిన కృషి చరిత్రాత్మకం. అందుకే మా దేశ అత్యున్నత గౌరవాన్ని ఆయనకు అందజేస్తున్నామని పేర్కొన్నారు.

అదే సమయంలో గాజా ప్రాంతంలో బందీల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతగా ఏడుగురు సజీవ బందీలను హమాస్‌ రెడ్‌ క్రాస్‌కు అప్పగించగా, మిగిలిన 20మందిని కొద్దిసేపటి క్రితం అప్పగించింది. 28 మృతదేహాలను కూడా ఇంకా హమాస్​ అప్పగించాల్సిఉండగా, వాటి ఆచూకీ తెలియడం లేదని హమాస్​ ప్రకటించింది.  ఇజ్రాయెల్‌ కూడా 1,900 మందికి పైగా పాలస్తీనియన్‌ ఖైదీల విడుదల జాబితాను ప్రకటించింది.

నోబెల్‌ శాంతి బహుమతి దక్కకపోయినా, గాజా–ఇజ్రాయెల్‌ శాంతి ప్రయత్నాలకు గుర్తింపుగా ట్రంప్‌కి ఇజ్రాయెల్‌, ఈజిప్టు ప్రభుత్వాలు ఇచ్చిన గౌరవాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

నోబెల్‌ శాంతి బహుమతి రాకపోయినా ట్రంప్‌కి ఇజ్రాయెల్‌, ఈజిప్టు ప్రభుత్వాలు అత్యున్నత పౌర పురస్కారాలు ఇవ్వనున్నాయి. గాజా శాంతి ఒప్పందంలో ఆయన కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు.