Site icon vidhaatha

NASA | సూరీడి విస్ఫోటనాల చిత్రాలను విడుదల చేసిన నాసా

జీఐఎఫ్‌ల విడుదల

విధాత : సౌరకుటుంబంలో సూర్యగ్రహం నుంచి వెలువడుతున్న మంటల(అగ్నికీలల విస్ఫోటనాలు) జీఐఎఫ్ చిత్రాలను నాసా విడుదల చేసింది. ఈ నెల 7,8 తేదీల్లో తమ సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ వీటిని చిత్రీకరించినట్టు నాసా తెలిపింది. వీటిని ఎక్స్-క్లాస్ ఫ్లేర్స్ అంటారని చెప్పింది. ప్రతి 11 ఏళ్లకు సౌర మంటలు పెరుగుతాయని, ఇవి భూమి వైపుగా ప్రసరించినప్పుడు ఉపగ్రహాలు, జీపీఎస్, రేడియో సిగ్నల్స్‌కు అంతరాయం కలుగుతుందని వివరించింది. నాసా విడుదల చేసిన జీఏఎఫ్ చిత్రాలు సూరీడులోని అగ్ని కీలల సునామీలను తలపిస్తున్నాయి.

Exit mobile version