Surgery During Earthquake In Russia | విధాత : రష్యాలో ఓ వైపు భారీ భూకంపం..ఇంకోవైపు సునామీతో ప్రజలంతా భయాందోళనలతో ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నాల్లో ఉండగా..ఓ ఆసుపత్రి వైద్య బృందం మాత్రం ఓ రోగి ప్రాణాలు కాపాడేందుకు ఆపరేషన్ లో నిమగ్నమైన వీడియో వైరల్ గా మారింది. రష్యాలోని కామ్చాట్కాలో భారీ భూకంపం సమయంలో ఓ ఆసుపత్రిలో వైద్యులు సర్జరీ చేస్తున్నారు. భూకంప తీవ్రతకు ఆసుపత్రి భవనం ఊగిపోతుండగా…భయంతో తమ ప్రాణాలు కాపాడుకునేందుకు సర్జరీని మధ్యలోనే వదిలేసి స్వార్థంతో పారిపోలేదు.
ఆపరేషన్ స్ట్రెచ్చర్ పైన ఉన్నపేషెంట్ కింద పడకుండా వైద్య సిబ్బంది గట్టిగా పట్టుకోగా..వైద్యులు సర్జరీ కొనసాగించి పూర్తి చేశారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. వైద్య బృందం వృత్తి నిబద్దతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆ సర్జరీ విజయవంతంగా జరిగిందని.. రోగి కోలుకుంటున్నారని రష్యన్ ఆరోగ్య శాఖ ప్రకటించడం విశేషం.
ఈ వైద్యులకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
ఆసుపత్రిలో సర్జరీ చేస్తున్నప్పుడు.. రష్యాలోని కామ్చాట్కాలో భారీ భూకంపం
అప్పుడు పారిపోకుండా.. పేషెంట్ కింద పడకుండా కాపాడిన వైద్య బృందం
నెట్టింట్లో వీడియో వైరల్.. వైద్య బృందంపై వెల్లువెత్తుతున్న ప్రశంసల వర్షం#Russia #RussiaEarthquake… pic.twitter.com/XVOpcFJqNY
— PulseNewsBreaking (@pulsenewsbreak) July 30, 2025