Site icon vidhaatha

క్యాథ‌లిక్ మ‌త‌పెద్ద పోప్‌కు శ‌స్త్ర చికిత్స‌..

విధాత,వాటిక‌న్ : పోప్ ఫ్రాన్సిస్‌కు ఉద‌ర సంబంధిత శ‌స్త్ర చికిత్స జ‌రిగింది. ఆయ‌న ఆరోగ్యంగా ఉన్న‌ట్లు వాటిక‌న్ అధికారులు తెలిపారు. మ‌రో ఏడు రోజుల పాటు ఆస్ప‌త్రిలోనే పోప్ ఫ్రాన్సిస్ ఉండ‌నున్న‌ట్లు వాటిక‌న్ పేర్కొన్న‌ది. పోప్‌కు సుమారు మూడు గంట‌ల పాటు స‌ర్జ‌రీ చేసిన‌ట్లు వాటిక‌న్ ప్ర‌తినిధి మాటియో బ్రూనీ తెలిపారు. రోమ్‌లోని జెమెల్లి హాస్పిట‌ల్‌లో ఆయ‌న‌కు చికిత్స చేశారు. క్యాథ‌లిక్ మ‌త‌పెద్ద పోప్ ఆరోగ్యం గురించి ప్ర‌తి రోజు రెండుసార్లు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేయ‌నున్నారు.

Exit mobile version