Asteroids | గ్రహశకలాలు అంతరిక్షంలో ఓ గమ్యం లేకుండా తిరుగుతూ వస్తుంటాయి. నిత్యం లెక్కనేని గ్రహశకలాలు విశ్వంలో దూసుకెళ్తుంటాయి. ఇందులో కొన్ని భూమి దిశగా వస్తుంటాయి. ఇందులో కొన్ని భూమి దిశగా దూసుకొచ్చినవి ఉన్నాయి. పలు గ్రహశకలాలు భూమి వాతావరణంలోకి రాగానే మండిపోయి బూడిదైన సంఘటనలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా మరో రెండు ఆస్ట్రరాయిడ్స్ భూమి దిశగా దూసుకువస్తున్నాయి. శుక్రవారం భూమికి సమీపంలోని ఉంచి వెళ్లనున్నట్లు నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ పేర్కొంది. అయితే, భూమికి దగ్గరగా వచ్చినా వాటితో ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని పేర్కొంది. గ్రహశకలాలు భూమి నుంచి దూరంగా దూసుకెళ్తాయని చెప్పింది.
శుక్రవారం 2014 ఆర్‌పీ15 అనే ఆస్ట్రరాయిడ్ భూమికి దగ్గరా రానున్నది. దాదాపు 93 అడుగుల వెడెల్పు ఉన్నది. ఇది భూమి నుంచి 4,180,000 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోతుందని పేర్కొంది. అదే రోజున 82 అడుగుల వెడ్పెల్పు ఉన్న 2024 ఆర్‌బ్ల్యూ25 అనే గ్రహశకలం 3,830,000 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లిపోతుందని పేర్కొంది. అయితే, ఆయా గ్రహశకలాల గురించి తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి నాసా నేతృత్వంలోని జెట్ ప్రొపల్షన్ ల్యాబ్ భూమికి దగ్గరగా వచ్చే వస్తులపై అధ్యయనం చేస్తుంది. వాటికి కదలికలను అంచనా వేసి భూమికి ఎదురయ్యే సవాళ్లను పరీక్షించేందుకు చర్యలు చేపడుతున్నది. వాస్తవానికి భూమి దిశగా ఆస్ట్రరాయిడ్స్ దూసుకువస్తున్న వాటితో ఇబ్బంది లేదని నాసా వర్గాలు పేర్కొంటున్నాయి. అవి భూమిని ఢీకొట్టే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని.. ఈ విషయంలో భయపడాల్సిన అవసరం ఏమీ లేదని చెబుతున్నాయి.