Site icon vidhaatha

UNO| ప్రపంచాన్ని రక్షించేందుకు కేవ‌లం రెండు సంవత్సరాలు మాత్ర‌మే ఉన్నాయి

యూఎన్‌ వాతావరణ నిపుణుని హెచ్చరిక

లండన్ : ఐక్యరాజ్యసమితి వాతావరణ నిపుణుడైన సైమన్ స్టీయెల్ బుధవారం వాత‌వ‌ర‌ణ విష‌యంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. లండ‌న్‌లో నిర్వ‌హించిన కేతన్ హౌస్ థింక్ ట్యాంక్ సెమినార్ లో ఆయ‌న మాట్లాడుతూ.. ప్రభుత్వాలు, వ్యాపార కుబేరులు, అభివృద్ధి బ్యాంకుల అధ్యక్షుల దగ్గర కాలుష్య మైన వాతావరణం మెరుగు పరచుకొనడానికి కేవలం రెండు సంవత్సరాలు మాత్ర‌మే మిగిలి ఉన్నాయన్నారు. రాబోయే తరాల వాతావరణ ప్రాజెక్టులకు మనం గ్రీన్ హౌస్ గ్యాస్ లను తక్కువ చేయవలసిన అవసరం ఉందని, ఇటువంటి బలమైన ప్రాజెక్టులను వెంటనే ఉనికిలోకి తీసుకురావాల‌న్నారు.

నూతన తరాల జాతీయ వాతావరణ ప్రాజెక్టులకు మనం గ్రీన్ హౌస్ గ్యాస్ లను వినియోగించ‌డం వెంటనే తగ్గించాల‌న్నారు. ప్రపంచాన్ని రక్షించాలంటే కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంది. అంటే ఈ గ్రహంపై ఉన్న వారందరి ముందు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే దీన్ని రక్షించుకొనడానికి సమయం మిగిలి ఉందన్నారు.
ప్రపంచంలో ముఖ్యంగా రాజకీయరంగంలో వాతావరణ సమస్యలపై చర్యలు తీసుకోవాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే వారి రోజువారి జీవితంలో ఇంటి బడ్జెట్లో వాతావరణ సమస్యలకు సంబంధించిన ఖర్చులు పెరుగి పోతున్నాయి. అది వాళ్లకు అర్థమవుతూనే వస్తుంది. వాతావరణ కాలుష్యం అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికి పెద్ద సవాల్ గా నిలిచింది. దీన్ని ఎదుర్కొనటం అందరి కర్తవ్యంగా మారిందని వెల్ల‌డించారు. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రత్యన్మాయ ఎనర్జీని సప్లై చేయాల్సిన అవసరం బాగా ఉంది. అంతేకాదు ఘోరమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనడానికి సహాయ పడవలసిన అవసరం కూడా ఉందని స్టీయెల్ తెలిపారు.

Exit mobile version