Site icon vidhaatha

Climate | గరిష్ఠానికి ఉష్ణోగ్రతలు..! 174 సంవత్సరాల చరిత్రలో జూన్‌లో తొలిసారిగా సాధారణం కంటే ఎక్కువగా నమోదు..!

Climate |

వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం ప్రపంచాన్ని శాసిస్తోంది. 174 సంవత్సరాల వాతావరణ చరిత్రలో జూన్‌లో గరిష్ట ఉష్ణోగ్రత చేరుకుంది. జూన్ నెలలో సగటు ఉష్ణోగ్రత సాధారణం కంటే 1.05 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడం ఇదే తొలిసారి.

నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ నేషనల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఇన్ఫర్మేషన్ తన తాజా నివేదికలో ఈ సమాచారాన్ని వెల్లడించింది. 20వ శతాబ్దపు సగటు ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవడం జూన్‌లో వరుసగా 47వ సారి. జూన్ 2019లో ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.9 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదైంది.

జూన్ 2022లో కూడా సాధారణం కంటే 0.89 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలా ఉండగా.. అమెరికాలో హీట్‌వేవ్‌ పరిస్థితులు నెలకొంటున్నాయి. నైరుతి అమెరికా నుండి వాషింగ్టన్ రాష్ట్రం వరకు ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకుంది. 11.30 కోట్ల మంది ప్రజలకు హీట్ వేవ్ హెచ్చరికలను వాతావరణశాఖ జారీ చేసింది.

రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం హెచ్చరించింది. బయటకు రావొద్దని ప్రజలకు సూచించింది. అయితే, ఎల్ నినో కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని నాసా పేర్కొంది. సముద్ర జలాలు వేడెక్కి ప్రపంచ వాతావరణాన్ని మారుస్తున్నాయని వెల్లడించింది.

Exit mobile version