Donald Trump | మ‌దురో త‌ర‌హాలోనే పుతిన్‌ని కూడా బంధిస్తారా..? ట్రంప్‌ సమాధానం ఏంటంటే..?

ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో పుతిన్‌ వైఖరితో విసిగిపోయాను. ఈ యుద్ధం కారణంగా చాలామంది చనిపోయారు. నేను ఇప్పటికే 8 యుద్ధాలు ఆపాను. కానీ రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మాత్రం ఆపలేకపోతున్నాను. ఇది చాలా క్లిష్టమైనది’ అని ట్రంప్‌ స్పష్టం చేశారు.

Donald Trump | వెనెజువెలాపై అమెరికా సైనిక దాడి చేసిన విషయం తెలిసిందే. మాదక ద్రవ్యాల నిర్వహణ,
అక్రమంగా అధికారంలో కొనసాగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌
మదురో (Nicolas Maduro)ను అధికారం నుంచి దింపేందుకు అనేక నెలలుగా ఒత్తిడి తీసుకువస్తున్న
అమెరికా చివరకు ఆయనను అదుపులోకి తీసుకుంది. ఆయనతోపాటూ మదురో భార్యను కూడా
నిర్బంధించి తీసుకెళ్లింది. ప్రస్తుతం మ‌దురో అమెరికా చెర‌లో ఉన్నారు.

అయితే, మదురో తరహాలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin)ను కూడా అమెరికా అదుపులోకి
తీసుకుంటుందంటూ తెగ ప్రచారం జరుగుతోంది. పుతిన్‌ (Putin)ను బంధించడానికి భవిష్యత్తులో రష్యాపై
సైనిక చర్య చేపట్టే అవకాశం లేకపోలేదంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవ‌ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
ఓ సంద‌ర్భంలో మాట్లాడుతూ మ‌దురో త‌ర్వాత ఆ లైన్‌లో పుతిన్ ఉన్నట్లు పేర్కొనడంతో ఈ వార్తలు
గుప్పుమన్నాయి. అయితే, దీనిపై ట్రంప్‌ (Donald Trump) స్పందించారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు
తదైన స్టైల్లో సమాధానం చెప్పారు.

ఆయిల్ కంపెనీ ప్రతినిధుల‌తో జ‌రిగిన స‌మావేశంలో.. మదురో తరహాలో పుతిన్‌ను కూడా బంధిస్తారా..?
అని ట్రంప్‌ను విలేకరులు ప్రశ్నించారు. అలాంటిదేమీ చేపట్టబోమని ట్రంప్‌ స్పష్టం చేశారు. పైగా పుతిన్‌
తనకు మంచి స్నేహితుడంటూ పేర్కొన్నారు. ‘ర‌ష్యా నేత‌ను టార్గెట్ చేసే ఆలోచ‌న లేదు. పుతిన్‌ నాకు మంచి
స్నేహితుడు. అతడితో నాకు మంచి రిలేష‌న్ ఉంది. అయితే, ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో పుతిన్‌
వైఖరితో విసిగిపోయాను. ఈ యుద్ధం కారణంగా చాలామంది చనిపోయారు. నేను ఇప్పటికే 8 యుద్ధాలు
ఆపాను. కానీ రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మాత్రం ఆపలేకపోతున్నాను. ఇది చాలా క్లిష్టమైనది’ అని ట్రంప్‌
స్పష్టం చేశారు.

Latest News