Site icon vidhaatha

canteen ‘uncle’ । ముంబైలో మరో ఘోరం.. క్యాంటిన్‌ అంకుల్‌ ఇబ్బంది పెడుతున్నాడంటూ జరిగింది చెప్పిన ఏడేళ్ల బాలిక

canteen ‘uncle’ । మహారాష్ట్రలోని బద్లాపూర్‌ (Badlapur) స్కూల్‌లో ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన, అంతకు ముందు కోల్‌కోతాలో మెడికోపై అమానవీయ లైంగికదాడి, హత్య ఉదంతాలపై దేశం అట్టుడికిపోతుండగానే.. ముంబైలో మరో ఆందోళనకర అంశం వెలుగులోకి వచ్చింది. ఏడేళ్ల బాలికను ఆమె చదువుకునే స్కూల్‌లోని పదహారేళ్ల బాలుడు లైంగికంగా వేధించాడు. వసాయి ఏరియాలోని (Vasai area) ఒక ప్రైవేటు పాఠశాలలో ఈ ఉదంతం చోటు చేసుకున్నది. రెండు వారాల క్రితం జరిగిన ఈ ఘటన.. స్కూలు టీచర్‌ చొరవచేయడంతో వెలుగులోకి వచ్చిందని టైమ్స్‌ ఆఫ్ ఇండియా తెలిపింది. రోజూ క్యాంటీన్‌కు వెళ్లే ఆ బాలిక.. ఎందుకనో కొద్ది రోజులుగా అటువైపు వెళ్లటం లేదు. ఆ బాలిక తరగతి టీచర్‌కు అనుమానం (suspicions) వచ్చి ఆరా తీశారు. బాలికకు విశ్వాసం కలిగించేలా దగ్గరకు తీసుకుని విషయం తెలుసుకున్నారు. ‘క్యాంటీన్‌ అంకుల్‌ (canteen ‘uncle’) ఇబ్బంది పెడుతున్నాడు’ అని  బాలిక చెప్పడంతో నిర్ఘాంత పోయారు. ఏ మాత్రం ఆలస్యం చేయని సదరు టీచర్‌.. విషయాన్ని ప్రిన్సిపల్‌ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తొలుత తల్లిదండ్రులు తటపటాయించినా.. ప్రిన్సిపల్‌ చొరవ తీసుకుని పోలీసులకు ఫిర్యాదు (police complaint) చేశారు. నిందితుడైన బాలుడిని పోలీసులు రిమాండ్‌ హోమ్‌కు తరలించారని, అతడిపై భారతీయ న్యాయ సంహిత (Bhartiya Nyaya Sanhita) (బీఎన్‌ఎస్‌) పోక్సో చట్టం (POCSO Act) కింద అభియోగాలు నమోదు చేశారని టైమ్స్‌ ఆఫ్ ఇండియా పేర్కొన్నది.

మరో ఘటనలో కాశిమీర (Kashimira) ప్రాంతంలో ఒక 12 ఏళ్ల బాలికపై అఘాయిత్యం చేసిన 25 ఏళ్ల ఫుడ్‌ డెలివరీ బాయ్‌ని (delivery man) పోలీసులు అరగంట వ్యవధిలోనే అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకానం.. శరద్‌ కనోజియా అనే ఈ నిందితుడు సదరు బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించి.. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఇంట్లోకి చొరబడి, బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తండ్రి వస్తుండటాన్ని పసిగట్టి.. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.  అయితే.. బాలిక తల్లి ఇంటికి చేరుకున్నాక.. రాత్రి 11.14 గంటల సమయంలో తల్లిదండ్రులు పోలీస్‌ హెల్ప్‌ లైన్‌ 112కు (helpline number 112) ఫోన్‌ చేసి విషయం చెప్పారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తు అనంతరం.. పొరుగింట్లో నివాసం ఉంటున్న నిందితుడిని 30 నిమిషాల్లోనే పట్టుకున్నారు. ఆ సమయంలో నిందితుడు నిద్రపోతున్నాడు. అతడిని అరెస్టు చేసిన పోలీసులు.. కోర్టులో ప్రవేశపెట్టారు. బాధితురాలి తండ్రి పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. తల్లి ఒక హోటల్‌లో వంటపని చేస్తుంటారు.

Exit mobile version