Site icon vidhaatha

Young Woman: భవనంపైకి ఎక్కి దూకుతానంటూ యువతి హల్చల్!

Young Woman: హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ యువతి భవనంపైకి ఎక్కి హల్ చల్ చేసింది. సిటీ సెంటర్ మాల్ పక్కనే ఉన్న ఏఐజి ఆసుపత్రి భవనం పైకి ఎక్కిన శివలీల అనే యువతి దూకుతానంటూ బెదిరింపులకు పాల్పడింది. గమనించిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకున్న పోలీసులు ఆ యువతిని కిందకు దించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. కిందకు దిగాలని, సమస్య ఏంటో చెప్పాలని ఆసుపత్రి సిబ్బందితో పాటు, పోలీసులు ఎంత వేడుకున్నా ఆ యువతి ఏ మాత్రం చెప్పకుండా అలాగే నిల్చొని చూసింది. ఎవ్వరూ దగ్గరికి రావొద్దంటూ షరతు విధించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

పోలీసుల వివరాల ప్రకారం.. ఏఐజీ ఆసుపత్రి బిల్డింగ్‌లో సదరు యువతి కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం.యువతిని అదే ఆసుపత్రిలో పని చేస్తున్న శివలీలగా పేర్కొన్నారు. ఇటీవలే శివలీలను యాజమాన్యం ఉద్యోగంలోంచి తీసేసినట్లు తెలుస్తోంది.తిరిగి ఉద్యోగం ఇవ్వాలని శివలీల డిమాండ్ చేస్తోంది. సడన్‌గా ఆమెను విధుల్లోంచి తొలగించడంతో తట్టుకోలేక ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించినట్లుగా తెలిపారు.

Exit mobile version