Madhu Yaskhi | స‌చివాల‌యంలో కుప్ప‌కూలిన మ‌ధు యాష్కీ.. గ‌చ్చిబౌలి ఏఐజీకి త‌ర‌లింపు

Madhu Yaskhi | కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్( Madhu Yaskhi )తెలంగాణ స‌చివాల‌యం( Secretariat )లో కుప్ప‌కూలిపోయారు.

  • Publish Date - September 16, 2025 / 05:48 PM IST

Madhu Yaskhi | హైద‌రాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్( Madhu Yaskhi )తెలంగాణ స‌చివాల‌యం( Secretariat )లో కుప్ప‌కూలిపోయారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం స‌చివాల‌యంకు వ‌చ్చిన మ‌ధు యాష్కీ గౌడ్‌.. మంత్రి శ్రీధ‌ర్ బాబు( Minister Sridhar babu )ను క‌లిసేందుకు ఆయ‌న పేషీకి వెళ్లారు. అక్క‌డే మ‌ధు యాష్కీ ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయారు.

దీంతో తీవ్ర ఆందోళ‌న‌కు గురైన కాంగ్రెస్ నేత‌లు, సిబ్బంది.. స‌చివాల‌యంలో ఉన్న డిస్పెన్ష‌రీలో త‌క్ష‌ణ వైద్య స‌హాయం అందించారు. మ‌ధు యాష్కీకి ఛాతీలో నొప్పి రావ‌డంతో కుప్ప‌కూలిన‌ట్లు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మ‌ధుయాష్కీని గ‌చ్చిబౌలిలోని ఏఐజీ ఆస్ప‌త్రికి( AIG Hospital ) త‌ర‌లించారు.