విధాత, హైదరాబాద్ : 42శాతం బీసీ రిజర్వేషన్(BC Reservation) సాధించేవరకు తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూల్ ఫ్రంట్ తమ ఉద్యమాన్ని ఉదృతం చేస్తాయని తెలంగాణ జాగృతి(Telangana Jagruthi) రాష్ట్ర అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన 72 గంటల నిరాహారదీక్ష(Hunger Strike)ను కవిత ట్యాంక్ బండ్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ధర్నా చౌక్ వద్ద ప్రారంభించారు. జాగృతి, పూల్ ఫ్రంట్ శ్రేణులు కవిత దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్లుగా బీసీలకు రిజర్వేషన్ కల్పించేదాక తాము పోరాటం చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని మేం డిమాండ్ చేస్తూ ఈ దీక్ష్ చేపట్టామన్నారు.
42శాతం బీసీ బిల్లు రిజర్వేషన్ బిల్లును కేంద్రం వద్ధకు పంపించేసి.. కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తుందన్నారు. బీజేపీపై నెపం పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం..ముస్లింల పేరుతో బీజేపీ బీసీ బిల్లు ఆమోదించకుండా తప్పించుకోవాలని చూస్తున్నాయన్నారు. బీజేపీ దేశంలోని ముస్లింలకు 10శాతం రిజర్వేషన్ ప్రత్యేకంగా ఇస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టాలన్నారు. కాంగ్రెస్ కూడా ఇందుకోసం ప్రయత్నించాలని డిమాండ్ చేశారు. 42శాతం బీసీ రిజర్వేషన్లలో ముస్లింకు వాటా ఉందో లేదో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత నివ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై స్పష్టత ఇచ్చాక గవర్నర్ సంతకం చేయకపోయినా..కేంద్రం అమోదించకపోయినా మేం ఢిల్లీకి వెళ్లి దీక్ష చేస్తామన్నారు.
తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారంలో వాటా, ఆర్థిక సమాన అవకాశాలు రావాలంటే వారికి రిజర్వేషన్ల కల్పించాల్సిన అవసముందన్నారు. బీసీ రిజర్వేషన్లకు దీక్ష చేస్తామంటే మాకు ధర్నా చౌక్ వద్ద అనుమతినివ్వడానికి ఎందుకు భయపడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేవలం సాయంత్రం ఐదు గంటల వరకు దీక్షకు అనుమతి ఇచ్చారని..72గంటల దీక్షకు అనుమించకపోతే మేం న్యాయపోరాటం కూడా చేస్తామన్నారు.