విధాత : వేములవాడ రాజన్న ఆలయం(Vemulawada Temple) అభివృద్ధి పనులపై వివాదం ముదిరింది. రాజన్న ఆలయాన్ని మూసివేసి(Temple Closure) భక్తులకు రాజన్న దర్శనాలు నిలిపివేసి అభివృద్ధి పనులు కొనసాగించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ(BJP Protest) ఆదివారం ఆందోళనకు దిగింది. ఈవో తీరుపై బీజేపీ మండిపడుతు..భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. ప్రభుత్వం దిష్టి బొమ్మను బీజేపీ శ్రేణులు దహనం చేసి నిరసన వ్యక్తం చేశాయి. అభివృద్ధి పేరిట వేములవాడ ఆలయాన్ని ఈవో ఆగం చేస్తున్నారంటూ బీజేపీ నాయకులు విమర్శలు గుప్పించారు. ఆలయ అభివృద్ది పనుల కోసమని చెప్పి.. రాజన్నకు ఏకాంత సేవలు, భీమన్న ఆలయంలో కోడె మొక్కులు అంటూ ఈవో కొత్త ఆచారం పెట్టడం ఏమిటని మండిపడ్డారు.
వేములవాడ ఆలయ ప్రతిష్ఠ దెబ్బతీస్తే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ భక్తులకు రాజన్న దర్శనాలు ఆపితే వేములవాడను అగ్ని గుండంగా మారుస్తామంటూ హెచ్చరించారు. మేం అభివృద్దికి వ్యతిరేకం కాదని..వేల సంవత్సరాలనుంచి కొనసాగుతు వస్తున్న దర్శనాలను, కోడె మెుక్కులను నిలిపివేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. దర్శనాలు కొనసాగిస్తునే ఆలయ అభివృద్ధి పనులు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.