విధాత, హైదరాబాద్ : ఫిరాయింపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే(BRS MLA)లపై సుప్రీంకోర్టు తీర్పు(Supreme Court Verdict)ను అనుసరించి అనర్హత చర్యలు(Disqualification)తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం( Assembly Gandhi Statue) వద్ధ మెరుపు ధర్నా(Dharna)కు దిగి నిరసన వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పును అనుసరించి ఫిరాయింపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత అంశంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్(Gaddam Prasad) ను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ వద్ధకు చేరుకున్నారు.
అయితే స్పీకర్ అందుబాటులో లేకపోవడం..కలిసేందుకు అనుమతి నిరాకరించడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గరకు వెళ్లి ధర్నా చేపట్టి నిరసన తెలిపారు. గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలుపై చర్చించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిన్న స్పీకర్‌ను కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు అపాయింట్మెంట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. తాము వచ్చాక స్పీకర్ అందుబాటులో లేరని ఆయన సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, వివేకా, సంజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.