ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ : సీఎం రేవంత్ రెడ్డి మరోసారి న్యూఢిల్లీకి చేరుకున్నారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించనున్నారు. రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ కూడా కోరారు. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదం కోసం ఆయన ప్రధానితో చర్చించనున్నట్లుగా సమాచారం. ఇతర పార్టీల నేతలను కూడా కలిసి పార్లమెంటులో బీసీ బిల్లుకు మద్ధతు కూడగట్టే ప్రయత్నం చేయనున్నారు.
తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి బుధవారం సోనియా గాంధీని కలుస్తారు. రేపు గురువారం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీలకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బిల్లు ఆమోదం కోసం లోక్‌సభ, రాజ్యసభల్లో ఒత్తిడి చేయాలని కోరనున్నారు.