విధాత, హైదరాబాద్ : జాతిపిత మహాత్మాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ అయ్యంగార్(Srikanth Ayyangar) పై కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఆగ్రహం కొనసాగుతుంది. నిన్న యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ కార్యక్తరలు శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన అరి సినిమా ప్రదర్శనను అడ్డుకుని నిరసన తెలిపారు. శ్రీకాంత్ అయ్యంగార్ పై ఇప్పటికే సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్( MLC Balmoor Venkat) ఆదివారం మా అసోసియేషన్ ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మాట్లాడుతూ సామాజిక బాధ్యత మరిచి జాతిపితపై అసభ్యకరంగా మాట్లాడిన శ్రీకాంత్ వంటి వ్యక్తులకు తగిన గుణపాఠం నేర్పించాల్సి ఉందని..అతడిని వెంటనే మా అసోసియేషన్ నుంచి తొలగించాలని కోరుతూ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. శ్రీకాంత్ అయ్యంగార్ ఇప్పటికైన తన తప్పు తెలుసుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకునేంత వరకు వదిలేది లేదన్నారు.