Mega Treat | మెగా ఫ్యాన్స్‌కు నేడు డబుల్ ట్రీట్.. చిరు, పవన్ సినిమాల‌ నుంచి సాయంత్రం 5 త‌ర్వాత కీలక అప్డేట్స్

Mega Treat | మెగా అభిమానులకు నేడు (డిసెంబర్ 13) పండగ వాతావరణం నెలకొననుంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి వరుసగా కీలక అప్డేట్స్ రావడంతో ఫ్యాన్స్‌లో భారీ ఉత్సాహం కనిపిస్తోంది.

Mega Treat | మెగా అభిమానులకు నేడు (డిసెంబర్ 13) పండగ వాతావరణం నెలకొననుంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి వరుసగా కీలక అప్డేట్స్ రావడంతో ఫ్యాన్స్‌లో భారీ ఉత్సాహం కనిపిస్తోంది. ఒకే రోజున ఇద్దరు స్టార్ హీరోల నుంచి అప్‌డేట్స్ రావడం మెగా క్యాంప్‌లో స్పెషల్ టాక్‌గా మారింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సంక్రాంతి 2026కు విడుదల లక్ష్యంగా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందాయి.

ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న గ్రాండ్ ప్రెస్ మీట్‌లో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదే ఈ చిత్రానికి తొలి అవుట్‌డోర్ ప్రమోషనల్ ఈవెంట్ కావడం విశేషం. ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుద‌లైన రెండు సాంగ్స్‌కి సూప‌ర్భ్ రెస్పాన్స్ వ‌చ్చింది. మీసాల పిల్ల సాంగ్ అయితే రికార్డులు క్రియేట్ చేసింది. మూవీ ట్రైల‌ర్ ఎప్పుడు విడుద‌ల అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సారి ప్ర‌భాస్‌తో చిరు ఫైటింగ్ ఆస‌క్తిక‌రంగా ఉండ‌నుంది.

మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్ కూడా నేటితో అధికారికంగా ప్రారంభం కానున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని తొలి పాట ‘డేఖ్‌లేంగే సాలా’ పూర్తి వెర్షన్‌ను సాయంత్రం 5:30 గంటలకు రాజమండ్రి సమీపంలోని సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో విడుదల చేయనున్నారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత మళ్లీ కలిసిన పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ – దేవిశ్రీ ప్రసాద్ త్రయం నుంచి మరో సెన్సేషన్ ఖాయమన్న అంచనాలు మెగా అభిమానుల్లో భారీగా ఉన్నాయి. మొత్తంగా ఒకే రోజు చిరు, పవన్ నుంచి వస్తున్న ఈ కీలక అప్డేట్స్ మెగా ఫ్యాన్స్‌కు నిజంగా డబుల్ ట్రీట్‌గా మారనున్నాయి.

Latest News