Election Commission| 334 రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు!

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం(CEC)  దేశంలోని 334 రాజకీయ పార్టీల(political-parties) ను గుర్తింపు జాబితా నుంచి తొలగిస్తూ(delisted) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పార్టీలను రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగించింది. వరుసగా 2019నుంచి ఆరు సంవత్సరాల పాటు ఎన్నికలలో పోటీ చేయని పార్టీలను గుర్తించి, ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 5 పార్టీలు, తెలంగాణకు చెందిన 13 పార్టీలు రాజకీయ పార్టీల గుర్తింపును […]

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం(CEC)  దేశంలోని 334 రాజకీయ పార్టీల(political-parties) ను గుర్తింపు జాబితా నుంచి తొలగిస్తూ(delisted) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పార్టీలను రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగించింది. వరుసగా 2019నుంచి ఆరు సంవత్సరాల పాటు ఎన్నికలలో పోటీ చేయని పార్టీలను గుర్తించి, ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 5 పార్టీలు, తెలంగాణకు చెందిన 13 పార్టీలు రాజకీయ పార్టీల గుర్తింపును కోల్పోయాయి. ఈసీ వద్ద నమోదైన పార్టీలు ఆరేళ్లలో కనీసం ఒక్క ఎన్నికల్లోనైనా పోటీ చేయకపోతే నిబంధనల మేరకు గుర్తింపు కోల్పోతాయి.

ఈ మేరకు 334 పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. పేరుకు పార్టీలుగా చలామణిలో ఉన్నప్పటికి వీటికి భౌతికంగా ఎలాంటి కార్యాలయాలు అందుబాటులో లేవని వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 2,854 గుర్తింపు పొందని పార్టీలు ఈసీ వద్ద రిజిస్టర్‌ అయి ఉన్నాయి. తాజా చర్యతో ఆ సంఖ్య 2,520కి తగ్గింది. ఎన్నికల సంఘం వద్ద ఉన్న డేటా ప్రకారం.. ప్రస్తుతం దేశంలో ఆరు జాతీయ పార్టీలుగా కొనసాగుతున్నాయి. 67 ప్రాంతీయ రాజకీయ పార్టీలు మనుగడలో ఉన్నాయి. ఆరు జాతీయ పార్టీలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఐఎన్ సీ)
కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్టు) (సీపీఎం), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఏఏపీ), నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్ పీపీ)లు ఉన్నాయి.