విధాత, హైదరాబాద్ : తెలంగాణలో మహిళా న్యాయవాది హత్య సంచలనం రేపింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ శివారులో న్యాయవాది స్వప్న కుమారి (34) దారుణ హత్యకు గురయ్యారు. పొలం వద్ద హత్యకు గురైన న్యాయవాదిని స్వప్నను దుండగులు మెడపై నరికి చంపారు. న్యాయవాది హత్యపై మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చేవెళ్ల కోర్టులో స్వప్న ప్రాక్టీసు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన స్వప్న కుమారి కుటుంబ కలహాల నేపథ్యంలో అన్న చేతిలోనే దారుణ హత్యకు గురైనట్లు స్థానికుల సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గతంలో పెద్దపల్లికి చెందిన న్యాయవాదులైన గట్టు వామనరావు దంపతులు 2021 ఫిబ్రవరి 17న హత్యకు గురవ్వడం కలకలం రేపింది. పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద కారులో వెళ్తున్న వీరిని అడ్డుకొని రోడ్డుపై హత్య చేశారు. ఈ కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది.
ఇవి కూడా చదవండి :
Praneeth Rao DSP demotion| ఫోన్ ట్యాపింగ్ కేసు ఎఫెక్ట్ .. ప్రణీత్ రావు డీఎస్పీ హోదా రద్దు
Congress Ticket Disputes | రోడ్డెక్కిన పంచాయితీలు: గందరగోళంగా కాంగ్రెస్ ‘మున్సిపల్’ టికెట్ల పంపకాలు
