Air India | ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఎయిర్ ఇండియా.. రూ.1499కే విమాన టికెట్‌..

ఎయిర్ ఇండియా ఫ్లైట్ టికెట్లపై భారీ ఆఫర్ ప్రకటించింది. న‌మ‌స్తే వరల్డ్ సేల్‌లో రూ.1499కే దేశీయ విమాన టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Namaste World Sale-Air India

సాధార‌ణంగా సుద‌రూ ప్ర‌యాణం చేసేవారు ఎక్కువ‌గా రైలునే అనుస‌రిస్తారు. ఎందుకంటే ట్రైన్ టికెట్ త‌క్కువ అని. రైలు కంటే విమాన ప్ర‌యాణం చాలా త‌క్కువ స‌మ‌యం ప‌డుతుంది. కానీ విమాన టికెట్ ధ‌ర‌లు (Air ticket Price) ఎక్కువ‌గా ఉంటాయి. అందుకే టైమ్ ఎక్కువ ప‌ట్టినా స‌రే రైలుకు వెళ్లేందుకే మొగ్గుచూపుతారు. ముఖ్యంగా సామాన్యులు.. దూర ప్ర‌యాణం చేసిన‌ప్పుడైనా విమానం ఎక్కాల‌న్న ఆశ‌, కోరిక వారిలో ఉంటుంది. కానీ టికెట్ ధ‌ర చూసి వెన‌క‌డుగు వేస్తుంటారు. అలాంటి వారి కోస‌మే కొన్ని విమాన‌యాన సంస్థ‌లు ప్ర‌త్యేక సేల్ పేరుతో త‌క్కువ ధ‌ర‌కే టికెట్ అందుబాటులో ఉంచుతుంటాయి.

సాధార‌ణంగా విమాన‌యాన సంస్థ‌లు రిపబ్లిక్ డే, న్యూ ఇయర్, హోలీ, దీపావళి, క్రిస్మస్, ఇండిపెండెన్స్ డే సహా సమ్మర్, వింటర్ వంటి ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ సేల్స్ తీసుకొస్తుంటాయి. తాజాగా టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా (Air India) సంస్థ విమాన ప్ర‌మాణికుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. “న‌మ‌స్తే వ‌ర‌ల్డ్ సేల్‌” (Namaste World’ Sale) పేరిట విమాన టికెట్ల‌పై రాయితీ ప్ర‌క‌టించింది. ఈ ఆఫర్‌లో ప్రాథమిక చార్జీలపై 20 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ సేల్‌లో దేశీయ టికెట్లు రూ.1,499 నుంచి, అంతర్జాతీయ టికెట్లు రూ.5,033 నుంచి ప్రారంభం కానున్నాయి. అంతేకాకుండా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై అదనపు రాయితీలు, ఒకసారి ఉచితంగా ప్రయాణ తేదీ మార్పు సదుపాయం కూడా కల్పిస్తోంది.

ఫిబ్ర‌వ‌రి 5లోపు

ఈ సేల్‌ ఫిబ్రవరి 5 వరకు బుకింగ్‌కు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కింద బుక్ చేసిన టికెట్లతో ఫిబ్రవరి 11 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రయాణాలు సాగించొచ్చు. సేల్‌ కాలంలో బుక్ చేసిన ప్రతి టికెట్‌కు ఏప్రిల్ 1 తర్వాతి ప్రయాణాలకు ఒకసారి ఉచితంగా తేదీ మార్చుకునే అవకాశం ఉంటుంది. అయితే, ప్రయాణానికి కనీసం72 గంటల ముందే తేదీ మార్చుకోవాలి. ఈ ఆఫర్ ఎయిరిండియా ఫ్లైట్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. వన్ వే, రౌండ్ ట్రిప్ బుకింగ్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ ఉంది. ఇందులో పరిమిత సంఖ్యలోనే సీట్లు అందుబాటులో ఉంటాయి.

ఎలా బుక్ చేసుకోవాలంటే..

ప్రయాణికులు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. అదనంగా, అనుమతి పొందిన ట్రావెల్ ఏజెంట్లు, విమానాశ్రయ టికెటింగ్ కార్యాలయాలు, కాంటాక్ట్ సెంటర్ ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. అంటే మందుగా బుక్ చేసుకొని వెళ్లిన వారికి టికెట్ లభించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. నగరాన్ని బట్టి టికెట్ ధ‌ర‌ల్లో వ్య‌త్యాసం ఉంటుంది.

ఇదిలా ఉండ‌గా.. ఎయిర్ ఇండియా సంస్థ ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్‌వైడ్‌గా దాదాపు 90 గమ్యస్థానాలకు విమానాల‌ను నడుపుతోంది. ఎయిర్ ఇండియా గ్రూప్ (ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్) 300కు పైగా విమానాలతో 55 దేశీయ, 45 అంతర్జాతీయ మార్గాల్లో సేవలు అందిస్తోంది. ముంబై-ఢిల్లీ వంటి రద్దీ మార్గాల్లో అధిక సంఖ్యలో విమానాలు నడుస్తున్నాయి. ఈ నమస్తే వరల్డ్ సేల్‌ ప్రయాణికులకు గణనీయమైన ఆదా కల్పించే అవకాశంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి :

Mamata Banerjee| ఎస్ఐఆర్ పై సుప్రీంలో సీఎం మమత బెనర్జీ సవాల్.. న్యాయవాదిగా వాదనలు !
MLA Sanjay disqualification petition dismissed| ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్ డిస్మిస్

Latest News