Site icon vidhaatha

Etala Rajender: కవిత ఎపిసోడ్ పై ఈటల సంచలన వ్యాఖ్యలు

Etala Rajender: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు కూతురు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ వ్యవహారంపై మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దృష్టిలో నెగెటివ్ గా పడితే ఇక అంతే సంగతులని..ఎవరినైనా టార్గెట్ చేస్తే వారు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే వదలరని ఈటల వెల్లడించారు. ఎదురు చెప్పే వారిని కేసీఆర్ తన సమీపంలోకి రానీయ్యడని..తెలంగాణ ఉద్యమ కాలం నుంచి దాదాపు 20 సంవత్సరాలుగా కేసీఆర్ ను దగ్గరి నుంచి చూశానని.. కేసీఆర్ స్వభావం తనకు తెలుసని ఈటల తెలిపారు.

‘కేసీఆర్ తనను తాను ఓ చక్రవర్తిలా, రాజులా భావిస్తుంటాడని.. ఒక్కసారి ఎవరిపైనైనా ఆయనకు నెగెటివ్ అభిప్రాయం పడితే ఇక అంతేఅని..అది ఎన్నటికీ మారదని ఈటల స్పష్టం చేశారు. కేసీఆర్ తో కవిత బంధం ఇక అతికే అవకాశమే లేదు’ అని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్, కవితల బంధం ఇక ముగిసినట్లేనని ఆయన పరోక్షంగా తేల్చిచెప్పారు. కేసీఆర్ కు ఎదురుచెప్పే వారు ఆ తర్వాత ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేరని ఈటల పేర్కొన్నారు. హరీష్ రావు అసంతృప్తి ఇప్పుడు స్టార్ట్ అయింది కాదని..ఎప్పటి నుంచో ఉందని..ఎంతో వేదన అనుభవించిండన్నారు.
ఒక్కటి మాత్రం సత్యం,ఆయన బీఆర్ఎస్ లోనే కొనసాగేలా వాతావరణం ఉంటది అని మాత్రం నేను నమ్మడం లేదని ఈటల చెప్పుకొచ్చారు.

Exit mobile version