విధాత, హైదరాబాద్ :
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి, మంత్రులు స్పష్టమైన హామీలు ఇచ్చినప్పటికీ సమస్యలు ఇంకా పెండింగ్లో ఉండటం శోచనీయమని తెలంగాణ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ , జనరల్ సెక్రటరీ ఎస్.ఏం హుస్సేని ముజీభ్ అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం రోజున హైదరాబాద్ లోని టీఎన్జీవో కేంద్ర సంఘం భవనంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్విహించారు. దీనికి కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకట్, కోశాధికారి ముత్యాల సత్యనారాయణ గౌడ్, అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, కేంద్ర సంఘ కార్యవర్గ సభ్యులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం గత 22 నెలలుగా ఎదురు చూస్తూ అనేకసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గ ఉపసంఘంతో, అధికారుల కమిటీతో చర్చలు జరిపినప్పటికీ ఉద్యోగుల సమస్య పరిష్కారం కాలేదన్నారు. పెండింగ్ బిల్లులు నెలకు 700 కోట్లు ఉద్యోగులకు చెల్లిస్తామని సీఎం ఆదేశాలు ఉన్నాయన్నారు. కానీ, బకాయిలు ఇప్పటివరకు చెల్లించకుండా తాత్సర్యం చేస్తూ ఉద్యోగుల గోడును పెడచెవిన పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అలాగే ఈహెచ్ఎస్ ఉద్యోగులకు ఆరోగ్య కార్డులను మంజూరు చేస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ తోనే పథకాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అలాగే, బకాయిపడ్డ 5 డీఏలు అడిగితే కేవలం ఒక్క డీఏ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. అలాగే 1.7.2023 నుండి అమలు చేయాల్సిన నూతన వేతన సవరణ మాట ఎత్తకపోవడం.. ముఖ్యమంత్రి, యావత్ మంత్రిమండలి సభ్యుల ఆదేశాలను గౌరవించాల్సిన అధికారులందరూ ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారా అనే అనుమానం కలుగుతున్నదన్నారు. ఇలా కాకుండా ఉండాలంటే సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు. తమ ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
ఉద్యోగుల ప్రధాన సమస్యలు ఇవీ…
1.పెండింగ్ బిల్లులను యుద్ధప్రాతిపదికన క్లియర్ చేయాలి.
2.పెండింగ్‌లో ఉన్న ఐదు కరువు భత్యాలను తక్షణమే విడుదల చేయాలి.
3.ఆరోగ్య రక్షణ పథకాన్ని (EHS) పూర్తి స్థాయిలో అమలు చేయాలి.
4.కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.
5.పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని 51శాతం ఫిట్‌మెంట్ అమలు చేయాలి.
6.వివిద కారణాలతో సస్పెండ్ అయిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి.
7.గచ్చిబౌలి స్థలాలను భాగ్యనగర్ టీఎన్జీవోలకు కేటాయించాలి.
8.స్థానికత ప్రాతిపదికగా అదనపు పోస్టులు సృష్టించి జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలి.
9.రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల కమిటీలను సకాలంలో ఏర్పాటు చేసి ప్రమోషన్లు ఇవ్వాలి. అలాగే మిగితా పెండింగ్ సమస్యలనింటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీశ్వర్, జనరల్ సెక్రటరీ ఎస్.ఏం. హుస్సేని ముజీభ్, అసోసియేట్ ప్రెసిడెంట్ కె. వెంకటేశ్వర్లు, కోశాధికారి ముత్యాల సత్యనారాయణ గౌడ్, పూర్వ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కే లక్ష్మణ్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు సంధ్య అశోక్ లకు కేంద్ర సంఘం పక్షాన సన్మానం చేశారు. ఈ సమావేశంలో ఆయా జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు నవీన్ కుమార్, ఎస్ విక్రమ్ కుమార్, కే శ్రీకాంత్, హరికృష్ణ, లక్ష్మణరావు, జి రాజీవ్ రెడ్డి చంద్రనాయక్, ఎన్ మురళి , జె శేఖర్ రెడ్డి, ఎన్ సుమన్ కుమార్, ఎన్ శేఖర్, వి. విజయ్ కుమార్, రాజేందర్, జి.రామకృష్ణ, జి. వేణుగోపాల్, కే. శ్రీనివాస్, సాయి భార్గవ్ చైతన్య, బి. శశిధర్, ఎం. నాగేందర్ రెడ్డి , కాజా షరీఫ్, పి శ్రీనివాస్, బి. రవికుమార్, ఎమ్ హరికృష్ణ , ఎన్. వెంకట్ రెడ్డి, ఎం నాగరాజు, శ్రీనివాస్ , జి. శ్రీహరి, రామ్మోహన్, డి నరేందర్, ఎం. రాజ్కుమార్, బి. రవి ప్రకాష్ , బి .భరత్, ములుగు పోలురాజు, చైతన్య, బి. వెంకటేష్, ఆర్. లక్ష్మణ్, బి. ప్రభాకర్, రవికుమార్, బి. శంకర్, రాజ్ నరేందర్ గౌడ్ , ఏ ప్రవీణ్ కుమార్ జి .సుదర్శన్ , జీ.పరమేశ్వర్, కే. విక్రం రెడ్డి , S.K..జానీ మియా, డి .శ్యామ్, జి. అశోక్ కుమార్, జిసి. రాజు, డి. భగత్ ఎం.డి ఖదీర్ నాగార్జున గౌడ్, ఆనంద్, శివకుమార్, అజ్మత్ పాషా లతో పాటు కేంద్ర సంఘ కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షులు పాల్గొన్నారు.
