Site icon vidhaatha

Betting Apps: వాళ్లు సెల‌బ్రిటీలు కాదు సైతాన్లు.. సుప్రీంలో KA పాల్ పిల్!

Betting Apps: : బెట్టింగ్స్ యాప్స్ కు వ్యతిరేకంగా ప్రజాశాంతి పార్టీ నాయకుడు కె.ఏ. పాల్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్‌లను నిషేధించాలని, వాటిని ప్రచారం చేస్తున్న ప్రముఖులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ వల్ల తెలంగాణ 978 మంది ఆత్మహత్యలు జరిగాయని అధికారిక లెక్కలే చెబుతున్నాయని, అందుకే ఈ యాప్స్ వ్యవహారంలో కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కారణంగా గాడ్ ఆఫ్ క్రికెట్ అని చెప్పుకునే సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ డెవిల్ అయ్యాడని కేఏ పాల్ విమర్శించారు. బెట్టింగ్ యాప్స్ వల్ల అంబానీ లాంటి వాళ్లు కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు.

బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రభుత్వాలకు రూ.7వేల నుంచి 14వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆలోచనతో ఈ సమస్యపై మిన్నకున్నారని.. నేను అంతకంటే రెట్టింపు ఆదాయం తెచ్చిపెడుతానని.. కాv అన్ని మనీ గేమింగ్స్ యాప్స్ ను నిషేధించాలని డిమాండ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి మియాపూర్ పోలీసులు 25 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసినందుకు వారికి ధన్యవాదాలన్నారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి 24 గంటల్లో వదిలేసినట్లు వీళ్లను వదలొద్దని కోరారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

బెట్టింగ్ యాప్స్ డ్రగ్స్ కంటే ప్రమాదకరమైనవని.. ఈ విషయాన్ని గతంలో తాను ఎన్నోసార్లు చెప్పానని అన్నారు. అప్పుడు తన మాటలను ఎవరూ పట్టించుకోలేదన్నారు. యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు 72 గంటల్లో క్షమాపణ చెప్పాలని, నష్టపోయిన వారికి పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. సినీ నటులు, క్రీడాకారులు, సెలబ్రిటీలను యువత రోల్ మెడల్ గా తీసుకుంటుందని… కానీ, వారంతా సైతాన్లుగా మారారని… ఎంతో మంది చావులకు కారణమయ్యారని మండిపడ్డారు.

Exit mobile version